HASSLE FREE DARSHAN TO PILGRIMS IN ENSUING SUMMER VACATION_ ఏప్రిల్‌ 20 నుండి వారాంతంలో బ్రేక్‌ దర్శనం ప్రోటోకాల్‌ ప్రముఖులకు పరిమితం : టిటిడి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 17 Apr. 18: Tirumala JEO Sri KS Sreenivasa Raju said that senior officers of TTD would be deployed to monitor Pilgrim line movement and provide them hassle free darshan in the 90 days till summer vacation is completed.

Review meeting on summer arrangements was held in Annamaiah Bhavan with all department HoDs in Tirumala on Tuesday. He directed the Annaprasadam and health wings.to make additional arrangements of food an water keeping in view the summer vacation rush. He also instructed the CMO Dr Nageswara Rao to keep ready ORS satchets and other medical facilities for the pilgrims.

Later speaking to media the JEO said, the VIP darshan will be restricted to only protocol VIPs during the week ends for the next 15 weeks starting from this week end onwards. From April 21 till Second week end of July no VIP recommendation letters will be entertained and the VIP devotees are requested to cooperate with this decision in the larger interests of common pilgrims during summer vacation”, he added.

SE 2 Sri Ramachandra Reddy, SE Electrical Sri Venkateswarulu, Temple DyEO Sri Harindranath, GM Sri Sesha Reddy, VSO Sri Ravindra Reddy, Annaprasadam SO Sri S Venugopal and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 20 నుండి వారాంతంలో బ్రేక్‌ దర్శనం ప్రోటోకాల్‌ ప్రముఖులకు పరిమితం : టిటిడి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఏప్రిల్‌ 17, తిరుమల, 2018: వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 20 నుండి జులై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. సిఫార్సు లేఖలు అనుమతించబడవని, ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వేసవి ఏర్పాట్లపై అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలు ముగియనుండడం, పరీక్షా ఫలితాలు విడుదల కావడం వల్ల భక్తులు అధికసంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తారని, టిటిడి ఈవో ఆదేశాల మేరకు ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వారాంతంలో భక్తుల ఏర్పాట్లను సీనియర్‌ అధికారులు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారంతోపాటు చట్నీ అందిస్తున్నట్టు వివరించారు. వేసవిలో రోజుకు 3 లక్షల నుండి 3.50 లక్షల వరకు లడ్డూలు తయారుచేసి భక్తులకు ఎలాంటి కొరత లేకుండా అందిస్తామని తెలిపారు.

సర్వదర్శనం భక్తులు ప్రవేశించే మార్గాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పోలీసుల సహకారంతో క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తామని జెఈవో తెలిపారు. భక్తులు పారదర్శకంగా దర్శన సమయాన్ని తెలియజేస్తామని, సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు. వారానికి ఒక లక్షా 27 వేల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కేటాయిస్తామన్నారు.

అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) శ్రీవేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విజివో శ్రీరవీంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.