JEO INSPECTS ANC AND SAPTHAGIRI SATRALU_ ఏఎన్‌సి, సప్తగిరి సత్రాల్లో జెఈవో తనిఖీలు

Tirumala, 17 April 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Monday inspected Sapthagiri Satralu and ANC areas in Tirumala to assess the services of srivari sevakulu.

He interacted with Sevakulu both at ANC and Sapthagiri Satralu reception counter and learnt from them the mode of services they are discharging.

The team from Medak and Visakhapatnam who are deployed in respective areas said that they take the details of total number of family members and mobile number, then allot the room and check the rooms after vacated by the Pilgrims.

The JEO also received feedback from the Pilgrims and sevakulu. He immediately instructed the concerned officials to install computers in the registration Counters and train the sevakulu to enter Pilgrims data in computer instead of manual operation.

SE 2 Sri Ramachandra Reddy, DyEO Sri EC Sreedhar, EE Sri Siva ramakrishna, PRO Dr T Ravi were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏఎన్‌సి, సప్తగిరి సత్రాల్లో జెఈవో తనిఖీలు

ఏప్రిల్‌ 17, తిరుమల, 2018: తిరుమలలోని ఏఎన్‌సి ప్రాంతం, సప్తగిరి సత్రాలను జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మంగళవారం ఉదయం తనిఖీ చేసి శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

ఆయా ప్రాంతాల్లోని రిసెప్షన్‌ కౌంటర్లలో నిర్వహిస్తున్న బాధ్యతలను శ్రీవారి సేవకులను అడిగి జెఈవో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మెదక్‌, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులు సమాధానమిస్తూ భక్తుల కుటుంబ సభ్యుల సంఖ్య, మొబైల్‌ నంబరు నమోదు చేసుకుని గది కేటాయిస్తున్నామని, ఖాళీ చేసిన అనంతరం పరిశీలిస్తున్నామని తెలియజేశారు. అనంతరం పలువురు భక్తులు, శ్రీవారి సేవకుల నుండి జెఈవో అభిప్రాయాలు సేకరించారు. రిసెప్షన్‌ కౌంటర్లలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి భక్తుల వివరాలను నమోదు చేసేలా సేవకులకు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు జెఈవో సూచించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీధర్‌, ఇఇ శ్రీశివరామకృష్ణ ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.