GOLD AND SILVER MEDALS FOR DHARMIC EXAMS WINNTERS_ HDDP SECRETARY_ ఉత్తమ సమాజ నిర్మాణానికి విద్యార్ధులను స‌నాత‌న ధ‌ర్మానికి చేరువ చెయ్యాలి : హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్

Tirupati, 31 Aug. 19: TTD proposes to present gold and silver medals to all best performers Of the 37th batch of Dharmic exams to be conducted in 2020, Says Dr. Ramana Prasad, Secretary of HDPP.

Speaking at a prize distribution event at the Mahati auditorium on Saturday for best performers of the 36th edition of dharmic exams conducted this year. He said TTD undertook dharmic exams, Managudi, and Shubhapradam programs to promote dharmic sentiments and aesthetic values among youth in the society.

He also disbursed cash and medal awards to winners of state and district level achiever’s on the occasion.

OSD Of Epic studies project Sri Samudrala Lakshmaiah, SVETA director Sri Sesha Shailendra, Superintendent Sri Prasad Reddy and Sri Gurunatham participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఉత్తమ సమాజ నిర్మాణానికి విద్యార్ధులను స‌నాత‌న ధ‌ర్మానికి చేరువ చెయ్యాలి : హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్

తిరుప‌తి, 2019 ఆగ‌స్టు 31: భావి భారత నిర్మాతలైన విద్యార్ధులను తాత్కాలికమైన భౌతిక ఆనందాల కంటే శాశ్వతమైన మానసిక ఆనందాన్ని పొందేందుకు స‌నాత‌న ధ‌ర్మంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి డా. ర‌మ‌ణ‌ప్ర‌సాద్ తెలిపారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన 36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ‌నివారం ఉద‌యం తిరుపతిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మంపై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు టిటిడి స‌నాత‌న విజ్ఞాన పరీక్షలు, శుభ్ర‌ప‌దం, మ‌న‌గుడి వంటి కార్య్ర‌క‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. 2020లో నిర్వ‌హించే 37వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బంగారు, వెండి పథకాలు ఇవ్వాలని టిటిడి నిర్ణయించినట్లు తెలిపారు.

ధర్మపరిచయంలో తిరుమ‌ల‌ విద్యార్థికి ప్రథమ ర్యాంకు

36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో ధర్మపరిచయం విభాగంలో తిరుమ‌ల‌లోని టిటిడి ఎస్వీ హైస్కూల్‌ 7వ తరగతి విద్యార్థిని డి.మౌనిక‌ ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా తూర్పు గోదావ‌రి జిల్లా భీమ‌న‌ప‌ల్లి ఎస్‌.బి.ఆర్‌.జ‌డ్‌.పి.పి.హైస్కూల్‌ 8వ తరగతి విద్యార్థిని ఎన్‌.నాగస‌త్య‌సాయి ద్వితీయ స్థానం, న‌ల్గొండ‌ జిల్లా నారాయ‌ణ‌పూర్‌లోని స‌ర్వేల్ టి.ఎస్‌.ఆశ్ర‌మ పాఠ‌శాల 8వ తరగతి విద్యార్థిఆర్ సాయి వెంక‌ట్ తృతీయ స్థానం సాధించారు.

చిత్తూరు జిల్లాలో..

36వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరులోని దేవి బాల‌మందిర్‌ ఇం.మీ.హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని జి. హ‌రిక‌ ప్ర‌ధ‌మ స్థానం, అర‌గొండ‌లోని జిల్లా ప‌రిష‌త్ బాలిక‌ల హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని కె.జోష్న్‌ ద్వితీయ స్థానం, రామ‌కుప్పం ఎ.పి.ఆద‌ర్శ పాఠ‌శాల‌ 8వ తరగతి విద్యార్థి బి.ఎస్‌.ప్ర‌దీప్ తృతీయ స్థానం సాధించారు.

రాష్ట్ర స్థాయలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు, చిత్తూరు జిల్లాతోపాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన వారికి రూ.4000/- నగదు, రెండో స్థానం సాధించిన వారికి రూ.3000/- నగదు, మూడో స్థానంలో నిలిచిన వారికిరూ.2000/- నగదు అందించారు.

జిల్లాస్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన వారికి రూ.1000/- నగదు, రెండో స్థానం సాధించిన వారికి రూ.750/- నగదు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.500/- నగదు అందించారు.

ఈ కార్యక్రమంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య‌, శ్వేతా సంచాల‌కులు శేష శైలేంద్ర‌, సూపరింటెండెంట్లు శ్రీ ప్రసాద్‌రెడ్డి, శ్రీగురునాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.