JEO INSPECTS SRIVARI TEMPLE WORKS AT VIZAG_ విశాఖ‌ప‌ట్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌య‌ నిర్మాణపనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 31 Aug. 19: TTD Joint executive officer Sri P Basant Kumar on Saturday inspected the ongoing construction work at Srivari temple in Visakhapatnam.

Speaking later he asked officials to complete works of Kalyana mandapam, compound walls, Pushkarani, office and others on the schedule.

He also visited the Sravana Centre at Visakhapatnam and enquired about services etc. with 30 odd inmates.

The JEO also visited the Srivari temple works at Parvatipuram, Peddabondpalli, and Salur and suggested improvements.

TTD Estate Officer Sri Vijayasarathi, DyEO Sri Damodaram and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విశాఖ‌ప‌ట్నంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌య‌ నిర్మాణపనులను పరిశీలించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 ఆగస్టు 31: విశాఖ‌ప‌ట్నంలోని రుషికొండ హిల్స్ వ‌ద్ద టిటిడి నూత‌నంగా నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆల‌య నిర్మాణం పనులను శ‌నివారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ నిర్మాణ పనులలో భాగంగా క‌ల్యాణ‌మండ‌పం, ప్ర‌హ‌రీ, పోటు, పుష్కరిణి, కార్యాల‌యం, తదితర నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంత‌రం వైజాగ్‌లో టిటిడి ఆద్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్ర‌వ‌ణం ఉపకేంద్రాన్ని త‌నిఖీ చేసి, ప్రస్తుతం ఇక్కడ శిక్షణ పొందుతున్నా30 మందికి పైగా చిన్నారుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు.

త‌ర్వాత‌ విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురం, పెద్ద‌బొండ‌ప‌ల్లి, కాలూరుల‌లో శ్రీ‌వారి దివ్య‌క్షేత్రాల‌ నిర్మాణానికి స్థ‌ల ప‌రిశీల‌న చేశారు.

జెఈవో వెంట టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, డెప్యూటీ ఇఇ శ్రీ దామోద‌రం, ఇత‌ర అధికారులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.