HDPP AND SVBC EXECUTIVE MEETINGS HELD _ టిటిడి ఛైర్మన్ ఆధ్వర్యంలో హెచ్‌డిపిపి, ఎస్వీబీసీ కార్యనిర్వాహక సమావేశాలు
BOARD DECIDES TO APPOINT CHAGANTI KOTESWARA RAO AS TTD’S DHARMIC ADVISOR
TIRUPATI, 20 JANUARY 2022: The HDPP Executive Committee has decided to appoint renowned spiritual speaker and scholar Brahmasri Chaganti Kotewara Rao as the Advisor for TTD Dharmic programmes said, TTD Trust Board Chairman Sri YV Subba Reddy.
Chairing the HDPP and SVBC Executive Committee meetings held at Sri Padmavathi Rest House in Tirupati on Friday along with the TTD EO Sri AV Dharma Reddy, the Chairman later briefed on some of the important decisions taken during the respective meetings. Some excerpts:
To take Hindu Dharma Prachara activities in a wide manner in the remote villages involving rural youth. More such programmes to be designed.
To provide necessary Bhajana and kolatam materials to the villagers to organise Bhajana and Kolatam programmes.
To conduct Yagas and Homams in every place seeking the divine intervention for the well-being of humanity.
As TTD has been conducting various Parayanams from the past three years for the sake of global devotees, the Committee felt the need of a proper guidance from a renowned person who is versatile in this area and referred the name of Brahmasri Chagani Koteswara Rao.
SVBC BOARD DECISIONS:
To provide more qualitative live programmes on SVBC since they have a global following
To telecast the pilgrimage experience of the devotees who are thronging to Tirumala through trek routes, and other mode of transportation from across the country and even overseas
To enhance the devotional quotient among the youth, programmes like “Adivo Alladivo” will be telecasted even in Kannada and Hindi SVBC.
Akin to Telugu and Tamil SVBC, the Kannada and Hindi channels will also have to be popularized among the public by designing and telecasting unique devotional programmes.
To show the world the wide range of medical services offered by TTD to the general public as well devotees through SVBC, BIRRD, Sri Padmavathi Children’s Hospital etc. as well medical advise on how to diseases and related information will be given by the expert doctors from TTD hospitals which will be telecasted by SVBC
Executive Committee members Sri Viswanath, Smt Malleswari, Sri Ramulu, JEO(H & E) Smt Sada Bhargavi, SVBC Chairman Dr Saikrishna Yachendra, CEO SVBC Sri Shanmukh Kumar, Special Officer All Projects Smt Vijaya Lakshmi, other members participated.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఛైర్మన్ ఆధ్వర్యంలో హెచ్‌డిపిపి, ఎస్వీబీసీ కార్యనిర్వాహక సమావేశాలు
– టిటిడి ధార్మిక సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమించాలని నిర్ణయం
తిరుపతి, 2023 జనవరి 20: టిటిడి ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డిపిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం ఛైర్మన్ ఆధ్వర్యంలో హెచ్‌డిపిపి, ఎస్‌విబిసి కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. అనంతరం టిటిడి ఈవో శ్రీఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ ఆయా సమావేశాలలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను వివరించారు.
– గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి.. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు రూపొందించాలి.
– గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందించాలి.
– మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహించాలి.
– ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టిటిడి మూడు సంవత్సరాల నుండి వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది కావున, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించింది.
ఎస్వీబీసీ బోర్డు నిర్ణయాలు:
– ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ ఉన్నందున ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించాలి.
– దేశం నలుమూలలతో పాటు విదేశాల నుండి తిరుమలకు వాహనాల్లో, నడక మార్గాల ద్వారా విచ్చేస్తున్న భక్తుల యాత్రానుభవాలను ఎస్వీబీసీలో ప్రసారం చేయాలి.
– యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి, “అదివో అల్లదివో” వంటి కార్యక్రమాలు కన్నడ, హిందీ ఛానళ్లలో ప్రసారం.
– ఎస్వీబీసీ తెలుగు, తమిళ ఛానళ్ల తరహాలో కన్నడ, హిందీ ఛానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేకమైన భక్తి కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయాలి.
– టిటిడి అందిస్తున్న ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను సాధారణ ప్రజలకు తెలిసేలా స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి కార్యకలాపాలను ప్రసారం చేయాలి. అలాగే పలు వ్యాధులకు సంబంధించిన వైద్య సలహాలను నిపుణులైన డాక్టర్లతో ఇప్పించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలి.
కార్యనిర్వాహక కమిటీల సభ్యులు శ్రీ విశ్వనాథ్, శ్రీమతి మల్లీశ్వరి, శ్రీ రాములు, జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.