HENCEFORTH MATHA VAISHNO SHRINE DEVOTEES SHALL GET BLESSINGS OF SRI BALAJI VENKATESWARA TOO – TTD TRUST BOARD CHAIRMAN _ వైష్ణోదేవి యాత్రకు వెళ్లే భక్తులు దర్శించుకునే సదుపాయం- టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

MAHA SAMPROKSHANAM OF JAMMU TEMPLE IS ON JUNE 8

 

JAMMU, 09 MAY 2023: The Maha Samprokshana ritual in Sri Venkateswara temple at Jammu will be observed on June 8 and henceforth the devotees who are visiting Mata Vaishno Devi in Katra shall have the blessings of Bhagawan Sri Balaji Venkateswara  too. said TTD Trust Board Chairman Sri YV Subba Reddy.

The TTD(Tirumala Tirupati Devasthanams) board chief along with the officials of TTD and District,Police administration inspected Lord Sri Venkateswara (Balaji) temple at Majeen in Jammu on Tuesday. Later speaking to media persons, he said, TTD has taken up the construction of Lord Sri Venkateswara temples across various cities for the benefit of those devotees who could not visit to Tirumala. “So far we have constructed temples at Visakhapatnam, Chennai, Hyderabad, Bhuvneshwar and temples are coming up at Mumbai, Raipur, Ahmedabad in near future. Apart from cities, to take forward Hindu Sanatana Dharma Prachara to the grassroot level we have also constructed Lord Venkateswara (Balaji) temples at Agency and remote areas like Seetampeta, Rampachodavaram etc. in Andhra Pradesh”, he maintained.

Adding further he said, the Government of Jammu has allotted over 62 acres of land and the temple was constructed at Rs.30crores. Besides the main temple, sub-shrines, Potu-kitchen area, Annaprasadam counter, parking lot, landscapes  etc.would also come up soon. 

Briefing on the Maha Samprokshanam, the Chairman said, the religious event will last for five days from June 4 to June 8 with Ankurarpanam on June 3. On June 8, Vigraha Pratistha, Maha Samprokshanam will be performed in the auspicious time. The devotees will be allowed for Lord’s darshan from 12 noon onwards on June 8th as the temple is located away from the City, we have sought the Government of Jammu to provide round the clock security”, he maintained.

The  Local Advisory Committee Chairman of Delhi Smt Vemi reddy Prasanti Reddy, Joint Executive Officer of TTD Sri Veerabrahmam IAS, Chief vigilance & security officer Sri Narasimha Kishore,IPS, local SP of Jammu Sri Rahul, TTD Chief Engineer Sri Nageswara Rao, SE Sri Satyanarayana, Se electrical Sri Venkateswarulu, EE Sri Sudhakar, TTD PRO Dr T Ravi , VGO Manohar, District Administration and Police officers and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 8న జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

– వైష్ణోదేవి యాత్రకు వెళ్లే భక్తులు దర్శించుకునే సదుపాయం

– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

 తిరుమల, 2023 మే 09: జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు.

అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ – కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు శ్రీ బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.

ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం భువనేశ్వర్ అమరావతి తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్ లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ రాహుల్, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ టీవీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, విజివో శ్రీ మనోహర్, పిఆర్వో డా. టి.రవి, ఇఇ శ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.