HOMA MAHOTSAVA ENDS AT SRI KT _ ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం
Tirupati, 2 December 2021: The 11 day Rudra Yagam (Sri Kapileswara Swamy Homa) organised by TTD as part of Homa Mahotsavam during Karthika month concluded on Thursday at Sri Kapileswara Swamy Temple.
As part of festivities in the morning Rudra Yagam samapthi, Maha Purnahuti, Maha Shanti Abhisekam, Kalasha Udwasana, Kalashabhisekam, and Harati were performed. Later in the evening Shiva Parvatula kalyanotsavam was celebrated.
On December 3, TTD is organising the Kalabhairava Swamy Homa.
Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, temple inspector Sri Reddy Shekar were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం
తిరుపతి, 2021 డిసెంబరు 02: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా పదకొండు రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వస్వామివారి హోమం(రుద్రయాగం) గురువారం ఘనంగా ముగిసింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం రుద్రయాగ సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, కలశాభిషేకం, హారతి నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల కల్యాణోత్సవం ఏకాంతంగా జరిగింది.
డిసెంబరు 3వ తేదీన శ్రీ కాలభైరవస్వామివారి హోమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.