Inauguration of Archaka Training programme for Girijan Community_ శ్వేతలో పూజా విధానంపై పునశ్శరణ తరగతులు
శ్వేతలో పూజా విధానంపై పునశ్శరణ తరగతులు
తిరుపతి ఫిబ్రవరి-5,2009: తి.తి.దే కు చెందిన శ్వేతలో నిర్వహిస్తున్న పూజా విధానంపై పునశ్శరణ తరగతులను మార్చినెల నుండి కర్నాటకరాష్ట్రం వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు తి.తి.దే జె.ఇ.ఓ. శ్రీవి.శేషాద్రి అన్నారు. గురువారం ఉదయం శ్వేత నందు గిరిజన గొరవలుకు జరిగిన మూడవ విడత పునశ్శరణ తరగతుల ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా జె.ఇ.ఓ., మాట్లాడుతూ మొదటవిడతలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల నుండి, రెండవ విడత రంపచోడవరం, విజయనగరం జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతాల నుండి ఈ తరగతులకు విచ్చేశారని, మూడవ విడతలో కూడా మహబూబ్‌నగర్, నల్గొండజిల్లాల నుండి వచ్చారని తెలి పారు. అర్చకత్వం చేసేవారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తమ తమ సంప్రదాయాల్ని గౌరవిస్తూ తాము ఇతరులకు ఆదర్శప్రాయమైన జీవనశైలిని అలవరచుకోవాలని అన్నారు. గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున, ధార్మిక కేంద్రాలకు వస్తారు గనుక, గ్రామాల్లో మంచి మార్పు తీసుకురావడానికి అర్చకులు ప్రయత్నించడం ద్వారా ఆదర్శమైన గ్రామాలను చూడవచ్చునని తెలిపారు.
తి.తి.దే పాలకమండలి నిర్ణయం మేరకు గిరిజన గ్రామాలలో ఆలయ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని, అయితే సదరు గ్రామస్థులు ఆలయ నిర్మాణానికి తగినంత స్థలం ఇవ్వాలని, అదేవిధంగా ఆలయాలకు విగ్రహాలు కూడా ఇస్తామని తెలిపారు.
శ్వేతడైరెక్టర్ శ్రీభూమన్ అర్చక శిక్షణాశిబిరం తీరుతెన్నలు, వాటి వివరాలను గురించి శిక్షణ తీసుకుంటున్న వారికి తితిదే చేస్తున్న సౌకర్యాలు గురించి వివరించారు. ఈ శిక్షణా తరగతులకు మహబూబ్‌నగర్, నల్గొండజిల్లాల నుండి 50 మంది గిరిజనులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలోని శ్రీకామాక్షి అమ్మవారికి ఫిబ్రవరి 6వ తేదిన సాయంత్రం 4.30గంటలకు చందనాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు.
ఉదయం 7.30 గంటలకు కామాక్షి అమ్మవారికి నిర్వహించే స్నపన తిరుమంజనంలో పాల్గొనదలచిన భక్తులు ఒక్కొక్కరు రూ.100/-లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే రోజున నూతన సేవ అయిన చందన అలంకారంతో కూడిన ఊంజల్‌సేవను నిర్వహిస్తారు. ఈ సేవకు ఇద్దరిని అనుమతిస్తారు. రూ.50/-లు చెల్లించి పాల్గొనాల్సివుంటుంది. ఇదే రోజున ఆలయంలో సర్వదర్శనం సాయంత్రం 4.30 గంటల నుండి 9.00 గంటల వరకు ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.