JAMMALAMADUGU ANNUAL FESTIVAL _ మే 4 నుండి 12వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 28 APRIL 2023: The annual Brahmotsavams in Sri Narapura Venkateswara Swamy temple at Jammalamadugu in YSR Kadapa district will be observed between May 4 and 12 by TTD.

 

The important days includes Dhwajarohanam on May 4, Garuda Vahanam on May 8, Rathotsavam on May 10 and Chakra Snanam on May 12.

 

On May 9, Kalyanam will be performed and Grihasta devotees shall participate on payment of Rs.300 per ticket on which two persons will be allowed.

 

Every day all projects dharmic programmes will be arranged.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 4 నుండి 12వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 ఏప్రిల్ 28: వై ఎస్ ఆర్ జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 3వ తేదీన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 13వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

04-05-2023 ధ్వజారోహణం
పెద్దశేష వాహనం

05-05-2023
చిన్నశేష వాహనం
హంస వాహనం

06-05-2023 ముత్యపుపందిరి వాహనం
సింహ వాహనం

07-05-2023
కల్పవృక్ష వాహనం
హనుమంత వాహనం

08-05-2023
పల్లకీ ఉత్సవం
గరుడ వాహనం

09-05-2023 సర్వభూపాల వాహనం కల్యాణోత్సవం
గజ వాహనం

10-05-2023
రథోత్సవం
అశ్వవాహనం

11-05-2023
సూర్యప్రభ వాహనం
చంద్రప్రభ వాహనం

12-05-2023
చక్రస్నానం ధ్వజావరోహణం


మే 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం,
ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.