TEMPORARY SUSPENSION OF SSD TOKENS AT TIRUMALA-JEO SREENIVASA RAJU_ తిరుమలలో తాత్కాలికంగా సర్వదర్శనం కౌంటర్ల మూత

Tirumala, 22 May 2018: The issuance of Sarva Darshan tokens will be suspended temporarily at Tirumala while it will continue as usual in Tirupati, in view of unprecedented summer pilgrim rush at hill town, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Addressing media persons at Annamaiah Bhavan on Tuesday after a review meeting with senior officers, the Tirumala JEO said, the hill town is currently witnessing unprecedented crowd with the announcement of results of entrance exams last week.

“There has been large number of absentees among slotted sarva darshan ticket holders, which is leading to extra pressure in the queue lines and darshan hours at the temple”, JEO observed.

He said the soft launch of Slotted Sarva Darshan (SSD) was made on April 28th and and full operation began from May 3. Till May 21, nearly 5,43,308 devotees had obtained Slotted Sarva Darshan tokens but only 4,02,011 had utilised it for darshan.

He said the absenteeism in SSD was recorded at 24% as against 7% each among Divya Darshan (Pedestrian) and Special darshan (Rs.300) ticket holders.

The Tirumala JEO said, 2/3 of devotees are taking SSD tokens at Tirumala and only 1/3 in Tirupati.

He appealed to the devotees, that Tirumala yatra could be more pleasant and hassle-free if the devotees avail the SSD tokens at Tirupati itself rather than trying for such tokens at Tirumala.

For the benefit of devotees, the Sarva Darshan queues will be commenced from the Lepakshi circle with immediate effect, he added.

The JEO said the TTD has utilised all media like public address system, FM Radio, hand outs, flexis, sign boards and also word of mouth through TTD staff and Srivari Sevakulu for spreading awareness about new system of SSD tokens. But still lot of publicity is required, he opined.

FACAO Sri Balaji, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, Sri Venkateswarlu, IT wing chief Sri Sesha Reddy, VSO Sri Ravindra Reddy and others participated in the review meeting.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో తాత్కాలికంగా సర్వదర్శనం కౌంటర్ల మూత

తిరుపతిలో యధావిధిగా టోకెన్ల కేటాయింపు

లేపాక్షి సర్కిల్‌ నుండి సర్వదర్శనం భక్తుల క్యూలైన్‌ ప్రారంభం

మీడియా సమావేశంలో జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2018 మే 22: తిరుమలలో అధిక రద్దీ కారణంగా సర్వదర్శనం కౌంటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, పున:సమీక్షించిన అనంతరం తిరిగి తెరిచే తేదీని తెలియజేస్తామని, తిరుపతిలో యథావిధిగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం అధికారుల సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడారు.

వేసవి సెలవులు కావడం, పోటీ పరీక్షల ఫలితాలు వెలువడడం వల్ల తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా భక్తులు తరలివచ్చారని, సర్వదర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు గైర్హాజరు అవుతున్న కారణంగా టోకెన్లు లభ్యమయ్యే సమయం వెనక్కి వెళుతోందని జెఈవో వివరించారు. తిరుమల, తిరుపతిలో ఏప్రిల్‌ 28న సాఫ్ట్‌లాంచ్‌ చేసి, మే 3వ తేదీ నుండి పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని తెలిపారు. మే 21వ తేదీ వరకు 5,43,308 మంది భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొందారని, అయితే, 4,02,011 మంది మాత్రమే ఈ టోకెన్ల ద్వారా దర్శనానికి వచ్చారని, 24 శాతం మంది గైర్హాజరయ్యారని వివరించారు. దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు 7 శాతం, రూ.300/- ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్లు పొందిన భక్తులు 7శాతం గైర్హాజరవుతున్నారని, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తుల విషయంలో గైర్హాజరు శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ కారణంగా సర్వదర్శనం టోకెన్లు పొందే భక్తులకు దర్శన సమయం పెరుగుతోందన్నారు.

తిరుమలలో మూడింట రెండొంతుల మంది, తిరుపతిలో మూడింట ఒక వంతు మంది సర్వదర్శన టోకెన్లు పొందుతున్నారని, దర్శన సమయం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని జెఈవో వివరించారు. సర్వదర్శనం టోకెన్ల విధానానికి సామాన్య భక్తులు ఎంతగానో సహకరించారని కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు పొందడం ద్వారా ప్రణాళికాబద్ధంగా తిరుమల యాత్ర సాగించవచ్చని సూచించారు. లేపాక్షి సర్కిల్‌ నుండి సర్వదర్శనం భక్తుల క్యూలైన్‌ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామని, దీనిపై రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా నిరంతరం ప్రకటించి భక్తులకు అవగాహన కల్పిస్తామని జెఈవో తెలిపారు.

అధికారుల సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.