TRAINING TO TTD PUPILS IN SKILL DEVELOPMENT_ టిటిడి విద్యాసంస్థల విద్యార్థులకు ఉపాధికి అవసరమయ్యే ”నైపుణ్యాభివృద్ధి” పై శిక్షణ :టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోలా భాస్కర్‌

Tirupati, 19 June 2018: With an aim to provide job opportunities to the students studying in TTD educational institutions, the JEO Tirupati Sri P Bhaskar called up on the faculty to train them in skill development.

A training programme on Skill development jointly organised by TTD Vidyadana Trust and Art of Living Sri Sri Rural Development Trust in SVETA building on Tuesday. Speaking on this occasion the JEO said, now-a-days though the children are coming out successfully from their academic career scoring high marks, they are unable to convert the same in earning jobs due to their inability to express. The lack of soft communication skills is impacting on their professional career”, he felt.

Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, the students belonging to TTD educational institutions will be trained in Skill development and soft communication skills to build their career.

The JEO said, in the first training programme, the students of SGS Arts, SV Arts and SPWDPG colleges are invited. The teachers will also be given the training tips by the skill development experts, so that they can train their students in communication skills, he added.

Sri Sri Development Trust Director Sri Digvijay said, along with the three year degree course, a special syllabus has been designed to train the students in soft communications skills. This includes time management, character building etc.

DEO Sri Ramachandra was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి విద్యాసంస్థల విద్యార్థులకు ఉపాధికి అవసరమయ్యే ”నైపుణ్యాభివృద్ధి” పై శిక్షణ :టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోలా భాస్కర్‌

తిరుపతి, 2018 జూన్‌ 19: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టిటిడి విద్యాసంస్థలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపాధికి అవసరమయ్యే ”నైపుణ్యాభివృద్ధి” పై శిక్షణ ఇవ్వాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌ అధ్యాపకులను కోరారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో టిటిడి విద్యాసంస్థలలోని అధ్యాపకులకు, గ్రూప్‌ లీడర్లకు జరిగిన శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పిజి కళాశాల, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టిటిడి విద్యా దాన ట్రస్టు, బెంగుళూరుకు చెందిన శ్రీశ్రీ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు గతేడాది నుంచి నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధికి అవసరమయ్యే శిక్షణ ఇవ్వడం ద్వారా సమాజంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రస్తుతం దేశంలో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉందని, విద్యార్థులకు నైౖపుణ్యం లేకపోవడం వల్ల అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. టిటిడి విద్యాసంస్థలలోని విద్యార్థులు, ఇతర కళాశాలల విద్యార్థుల కంటే భిన్నంగా ఉండేలా తీర్చిదిద్దాలన్నారు.

విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసము పెంచడానికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, తదితర అంశాలపై నిష్ణాతులైన ఆధ్యాపకులతో పాఠ్యాంశాలు రూపొందించి, శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చదువుతోపాటు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన పెంచడానికి, ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి అధ్యాపకులు, గ్రూపు లీడర్లు భాధ్యతాయుతంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని జెఈవో కోరారు.

అనంతరం బెంగుళూరుకు చెందిన శ్రీశ్రీ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ శ్రీ దిగ్విజయ్‌ మాట్లాడుతూ 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుతో పాటు నైపుణ్యాభివృద్ధిపై పాఠ్యాంశాలు రూపొందించినట్లు తెలిపారు. ఇందులో విద్యార్థులకు సమయపాలన, ఆకర్షణీయంగా మాట్లాడే విధానం, నలుగురితో మాట్లాడటానికి, నాయకత్వ లక్షణాలు, సమాచార నైపుణ్యాలు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, సృజనాత్మక ఆలోచన, ప్రదర్శన నైపుణ్యం, సమర్థవంతమైన భావవ్యక్తీకరణ, బాడీ లాంగ్వేజ్‌, మాట్లాడేసమయంలో బిడియం పొగొట్టడం వంటి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో శ్రీ ఎమ్‌.రామచంద్ర, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పద్మావతి, ఎస్‌జిఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎ.బి శాంతి, ఎస్‌పిడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సి. మణి, ఇతర అధికారులు, అధ్యాపకులు, గ్రూప్‌ లీడర్లు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.