JEO REVIEWS CHAKRASNANAM ARRANGEMENTS_ చక్రస్నానం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
Tirumala, 17 October 2018: Tirumala Sri KS Sreenivasa Raju today asked the officials to make arrangements for smooth entry and exit gates for all at Swami Pushkarini for holy chakrasnanam event.
Addressing officials on Wednesday at the Brahmotsavam control room on the preparations for Thursday morning event, the JEO said Chakrasnanam would be conducted between 6.AM-9.00 IS. Lord Malayappaswamy along with his consorts and Sudarshana Chakrathalwar after Snapana Thirumanjanam inside the temple.
He said 26 swimmers and boats would be in place at Swami Pushkarini to avoid any untoward incident during the Chakrasnanam event. LEDs also have been installed around the Swami Pushkarini to facilitate the devotees to view the live Chakrasnanam event telecast by the SVBC.
He also appealed that devotees should co-operate and retrain themselves and enter the Pushkarini only through the designated gates. Since the holy muhurtam of Chakrasnanam exists through out the day, the devotees should patiently wait for their turn and experience the holy ritual of Chakrasnanam, he said.
He instructed the duty officers to strictly implement their responsibilities.
Among others in charge CVSO Incharge Sri Siva Kumar Reddy, SEs Sri Ramachandra Reddy and Sri Venkateswarlu and other duty officers participated in the review meeting.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
చక్రస్నానం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
తిరుమల, 2018 అక్టోబర్ 17: శ్రీవారి బ్రహ్మోత్సవాల చివరి రోజైన గురువారం ఉదయం జరుగనున్న చక్రస్నానం ఏర్పాట్లపై బ్రహ్మోత్సవాల కంట్రోల్ రూమ్‌లో బుధవారం ఉదయం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలన్నారు.
నిర్దేశించిన గేట్ల ద్వారా పుష్కరిణిలోకి ప్రవేశించాలని, భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించాలన్నారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చని జెఈవో విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.