JEO INSPECTS COUNSELLING FOR TTD JUNIOR COLLEGE ADMISSIONS_ టిటిడి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రారంభం పరిశీలించిన తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
Tirupati, 10 Jun. 19: TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmikantham on Monday inspected the ongoing counselling of admissions in TTD junior colleges for students who had applied online for the academic year 2019-20.
Speaking on the occasion the JEO said the counselling will be held at Sri Govindarajaswamy Arts College from June 14th for students of Sri Padmavathi Junior College, S.V Junior College, SPW Degree and PG college and SGS Arts College. Counselling will be conducted for 800 applicants in each college Center.
The College staff will assist the students to fill up the admission forms without mistakes. Admissions are granted on merit and reservations after scrutiny of certificates and the applications.
He said the first phase of counselling will continue till June 18 and the second and third phase of counselling will be conducted on June 20 and June 27 respectively.
DEO of TTD institutions Sri Ramachandra and other officials participated in the inspection.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రారంభం పరిశీలించిన తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 జూన్ 10: టిటిడిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో 2019-20వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్ధిని విద్యార్ధులకు సోమవారం నుండి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్‌ను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతోందన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను జూన్ 14న శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఒక్కో కళాశాలలో రోజుకు 800 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ జరుగుతోందన్నారు. విద్యార్థులు తప్పుల్లేకుండా దరఖాస్తులను పూర్తి చేసేందుకు వీలుగా కళాశాల సిబ్బంది సూచనలిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల దరఖాస్తులను, ధ్రువపత్రాలను పరిశీలించిన తరువాత మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్టు వివరించారు. మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 18వ తేదీ వరకు జరుగుతుందన్నారు. జూన్ 20 నుండి 27వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
జెఈవో వెంట టిటిడి డిఇవో శ్రీ ఎం.రామచంద్ర ఇతర అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.