SADHU SUBRAHMANYA SHASTRI OFFERED TRIBUTES_ శ్రీ‌వారి ఆల‌య చ‌రిత్ర‌ను విశ్వ‌వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 10 Sep. 19: Renowned Historian, Epigraphist and the first Peishkar of Tirumala Tirupati Devasthanams(TTD) Sri Sadhu Subrahmanya Shastry remembered on the occasion of his 38th Death Anniversary on Monday in Tirupati.

Speaking about the legendary multifaceted personality, Tirupati JEO Sri P Basant Kumar said, Sri Shastry brought to the light the greatness of Tirumala temple by resolving the information in the inscriptions.

Even many sankeertans of Annamacharya were also introduced to the music world because of the efforts of Sri Shastry, he recalled during a meeting convened in SVETA building on the occasion.

Earlier floral tributes were paid to the bronze statue of Sri Shastry. SVETA Director Sri Sesha Sailendra and others also participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌య చ‌రిత్ర‌ను విశ్వ‌వ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 సెప్టెంబరు 10: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ కొనియాడారు. శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 38వ వ‌ర్ధంతి వేడుక‌లు మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా శ్వేత భ‌వనం ఎదురుగా గ‌ల ఆయ‌న కాంస్య విగ్ర‌హానికి జెఈవోతోపాటు శ్వేత ఇన్‌చార్జి సంచాల‌కులు శ్రీ శేష శైలేంద్ర త‌దిత‌రులు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

అనంత‌రం వెంగ‌మాంబ స‌మావేశ మందిరంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జెఈవో మాట్లాడుతూ శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. ఆయ‌న సేవ‌ల‌ను ప్ర‌తి ఏడాదీ స్మ‌రించుకుంటున్నామ‌ని వివ‌రించారు. శ్వేత ఇన్‌చార్జి సంచాల‌కులు శ్రీ శేష శైలేంద్ర మాట్లాడుతూ శాస్త్రిగారు శాస‌నాల‌ను ప‌రిష్క‌రించి నాటి చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందించార‌ని తెలిపారు. ఆ త‌రువాత ఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కె.స‌ర్వోత్త‌మ‌రావు శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి జీవిత విశేషాల‌ను వివ‌రించారు.

ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు, కడప ప్రిన్సిపల్ సీనియ‌ర్ సివిల్ జడ్జి శ్రీ సిఎన్.మూర్తిని జెఈవో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి స‌హ ప‌రిశోధ‌కులు శ్రీ ఎస్‌.కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.