Rs.76LAKH JEWELS TO APPALAYAGUNTA SRI PRASANAVENKATESWARA SWAMI TEMPLE SAYS JEO TIRUPATI _ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయానికి రూ.76 లక్షల విలువైన ఆభరణాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 27 December 2017:The TTD JEO Tirupati Sri Pola Bhaskar today said that gold and diamond jewelry worth Rs,76 lakhs were handed over to the Sri Prasanna Venkateswara temple, Appalayagunta.

The JEO who inspected the arrangements at the temple for the V-Day said the TTD sub temple would be developed in a phased manner and presently the temple 5 kgs of gold and 103 kgs of silver ornaments were available in the temple for adorning the deities.
He said the utsava and main idols of the temple will be decked up with glittering jewels and diamonds on the V-day.

Similarly all arrangements were made for provision of drinking waer,annaprasadams , queue lines lighting and flower deoratons .
He was accompanied by TTD Special grade Dy EO Sri Muniratnam REddy, VGO Sri Ashok kumar Goud, DE(Electricals) Sri Chandrasekhar, Supdt.Sri Gopalalrishna,Temple Inspector Sri Srinivasulu in his inspection visit


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయానికి రూ.76 లక్షల విలువైన ఆభరణాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పరిశీలన

డిసెంబరు 27, తిరుపతి, 2017 ; అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి రూ.76 లక్షల విలువైన ఆభరణాలను అందించినట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. అప్పలాయగుంటలోని ఆలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను బుధవారం సాయంత్రం జెఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆభరణాల తయారీకి 2.50 కిలోల బంగారం, 103 కిలోల రాగిని వినియోగించినట్టు వివరించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు 11, ఉత్సవర్లకు 9, శ్రీ పద్మావతి అమ్మవారి మూలవర్లకు 8, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి మూలవర్లకు 5, శ్రీదేవి అమ్మవారి ఉత్సవర్లకు 5, శ్రీ భూదేవి అమ్మవారి ఉత్సవర్లకు 5 ఆభరణాలు ఉన్నట్టు తెలియజేశారు. ఈ ఆభరణాలను వైకుంఠ ఏకాదశి రోజున స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తామని తెలిపారు. డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం, డిసెంబరు 30న వైకుంఠ ద్వాదశినాడు ఉదయం 10 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తామని తెలియజేశారు. పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు అనుగుణంగా క్యూలైన్లు, ప్రసాదాలు, తాగునీరు, విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ తదితర ఏర్పాట్లు చేపడుతున్నట్టు చెప్పారు.

జెఈవో వెంట టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, డిఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీశ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.