JEWELS PRESENTED TO LORD SRI RAMA _ ఒంటిమిట్ట కోదండరామునికి కానుకగా శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు
Vontimitta, 30 March 2018: A set of precious jewels from the coffers of Tirumala were presented to Vontimitta Kodandarama Rama Swamy on the celestial occasion of Sri Sita Rama Kalyanam.
Tirumala JEO Sri KS Sreenivasa Raju brought the jewels from Tirumala which includes one gold kasula mala, one plait jewel and two haram worth about. Rs.15lakhs.
Braving the inclement weather conditions, the devotees thronged the Kalyana Vedika to witness the celestial wedding ceremony of Sri Sita Rama Kalyanam and get immersed in the devotional bliss.
On Friday evening after Edurkolu of Sita Rama, heavy down pour coupled with gale and lightening occurred. However the devotees braved the unfavourable weather conditions chanting Sri Rama Nama and Anjaneya Nama and took part in Kalyanam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఒంటిమిట్ట కోదండరామునికి కానుకగా శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు
ఒంటిమిట్ట, 2018 మార్చి 30: ఒంటిమిట్ట కోదండరామునికి కానుకగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక జడ బిల్ల, ఒక కాసులదండ, 2 చైన్లు కానుకగా అందించినట్టు టిటిడి తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఈ ఆభరణాలను తిరుమల నుండి తీసుకొచ్చి సమర్పించారు.
ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడి స్థానికాలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలను కానుకగా సమర్పించడం ఆనవాయితీ వస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఈ ఆభరణాలను శాశ్వత ప్రాతిపదికన ఒంటిమిట్ట రామాలయానికి అందించినట్టు తెలిపారు. ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి టిటిడి అన్ని ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.