OFFERING SERVICES TO PILGRIMS WITNESSING LORD AMONG DEVOTEES IS SRIVARI SEVA-SO TIRUMALA_ భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించాలి – తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirumala, 5 Sep. 19: Discover the presence of lord among scores of devotees visiting Tirumala temple every day and offer the best possible selfless services to them to get the benign blessings of Sri Venkateswara Swamy, said, Tirumala Special Officer Sri AV Dharma Reddy.
The SO graced the Satsang-Orientation programme held for Srivari Sevakulu at Srivari Seva Sadan office in Tirumala on Thursday. Addressing the huge gathering of Srivari Sevakulu, the Special Officer said, the Sevakulu have been rendering impeccable services to visiting pilgrims in Tirumala and also in Tirupati. “Getting an opportunity to render service in Srivari Seva is because of our good deeds in our previous birth. In Tirumala everything, be it a tree, a stone, air we breathe, mountains we climb etc.are nothing but the embodiment of divine forces. This is what was described by Saint Poet Sri Tallapaka Annamacharaya even in his Kritis. While Sri Ramanujacharaya proved what is the real Bhakti by trekking Tirumala footpath on his knees”, he added.
Exemplifying the Gajendra Moksha episode from Srimad Bhagavatham, the SO said, in this the renowned Telugu poet Sri Bammera Potana clearly describes that when it comes to the rescue of His devotees, Lord will forget and leave behind his spouse Lakshmi Devi, weapon Disc also. “So if you serve the devotees of Lord with utmost devotion then you will get the real blessings of the Almighty”, he observed.
Earlier, TTD PRO and HoD of Srivari Seva Dr T Ravi, briefed on the inception of Srivari Seva and the importance of Srivari Seva in offering services to pilgrims. “Started with just 195 in the 2000 today in the last 19 years nearly, 11,25,700 have offered services in Srivari Seva”, he maintained.
Before the commencement of meeting, the SO inspected the registration process, locker allotment system. A 10-minute short film on Srivari Seva and the experiences of Srivari Sevakulu was also displayed after Bhajans.
Special Officer of Annaprasadam Sri S Venugopal, Catering Officer Sri GLN Sastry, EEs Sri Subramanyam, Sri Mallikarjuna Prasad, DE Electrical Smt Saraswati, APRO Ms P Neelima, Seva Sadan AEO Sri U Ramesh, AE Sri Varaprasad and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవలందించాలి – తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2019 సెప్టెంబరు 05: శ్రీవారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని శ్రీవారిసేవ భవన సముదాయాలను గురువారం ఉదయం ప్రత్యేకాధికారి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి శ్రీవారి సేవకులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి సేవకులు టిటిడిలోని అన్ని విభాగాలలో చాలా అద్భుతంగా సేవలు అందిస్తున్నారన్నారు. తిరుమలలో నీరు, గాలి, చెట్లు, రాళ్ళలో దేవతలు, మునులు ఉంటారని, శ్రీరామానుజాచార్యులు, శ్రీ అన్నమయ్య వంటి ఎందరో మహనీయులు నడిచిన పవిత్ర స్థలంలో సేవలందించడం పూర్వజన్మ పుణ్యఫలమన్నారు. తిరుమలలో మానవసేవయే మాదవసేవగా భావించి శ్రీవారి భక్తులకు భక్తి భావంతో విశేష సేవలందించే శ్రీవారిసేవకులు స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారన్నారు. గత 19 సంవత్సరాలుగా తిరుమలలో శ్రీవారిసేవ అత్యున్నత స్థాయికి చేరిందన్నారు. గజేంద్రమోక్షంలో శ్రీ మహావిష్ణువు తన భక్తులను రక్షించిందుకు వైకుంఠం నుండి భూమిపైకి వచ్చిన కథను ఉదాహరించారు. కావున అదేరీతిలో శ్రీవారిసేవకులు కూడా భక్తులకు విశేష సేవలందిస్తే స్వామివారు కటాక్షిస్తారన్నారు.
అనంతరం టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా..టి.రవి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో 2000వ సంవత్సరంలో 195 మందితో శ్రీవారి సేవ అనే స్వచ్ఛంద సేవ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ 1,500 మందికి తగ్గకుండా, పర్వదినాల్లో 3,000 నుండి 3,500 మంది వరకు శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని వెల్లడించారు. గత 19 సంవత్సరాలలో దేశంలోని వివిద రాష్ట్రాల నుండి 11 లక్షల 25 వేల 700 మంది సేవలందించినట్లు వివరించారు.
తర్వాత ప్రత్యేకాధికారి శ్రీవారిసేవ భవన సముదాయాలలో పెండింగ్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకుల నమోదు కౌంటర్లు, మంచాలను, మరుగుదొడ్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు. శ్రీవారిసేవకులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శ్రీవారిసేకుల అనుభవాలపై రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, ఇఇ-1 శ్రీ సుబ్రమణ్యం, ఎఫ్ఎమ్ఎస్ ఇఇ శ్రీ మల్లిఖార్జున ప్రసాద్, డిఇ శ్రీమతి సరస్వతి, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రీ, ఏపిఆర్‌వో కుమారి పి.నీలిమా, ఏఈవో శ్రీ రమేష్, శ్రీవారిసేవకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.