KAVACHA PRATISTHA OBSERVED IN SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

Tirupati, 23 July 2018: On the second day of annual Jyesthabhishekam in Sri Govinda Raja Swamy temple, Kavacha Pratistha ceremony was carried out with religious fervour on Monday.

In the evening the Lord along with Goddesses will be taken on a procession around the streets on golden Tiruchi.

HH Sri Pedda Jiyar, HH Sri Chinna Jiyar Swamijis, DyEO Smt Varalakshmi and other temple staffs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

తిరుపతి, 2018 జూలై 23: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు సోమవారం కవచప్రతిష్ఠ వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ఠ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ జ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.