JYESTABHISHEKAM POSTERS RELEASED_ శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 5 Jul. 19: In view of the annual Jyestabhishekam at Sri Govindaraja Swamy temple in Tirupati from July 12-14, the wall posters for the same were releasef by Tirupati JEO Sri P Basanth Kumar.

The release event took place in the JEO chamber in Tirupati on Friday in TTD Administrative Building in Tirupati.

Special Grade DyEO Smt Varalakshmi was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్టాభిషేకం గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2019 జూలై 05: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 12 నుండి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) గోడపత్రికలను శుక్ర‌వారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇందులో స్వామివారి స్వర్ణకవచాలకు జూలై 12న కవచాధివాసం, జూలై 13న కవచ ప్రతిష్ఠ, జూలై 14న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.