SAHSRA KALASABHISHEKAM CONCLUDES AT SRI KRT_ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా సహస్ర కలశాభిషేకం

Tirupati, 18 November 2017; The holy ritual of Sahasra Kalashabisekham was performed at Sri Kodandarama Temple on the eve of Amavasya ,Saturday.

Later in the evening Hanumantha Vahana was conducted for the bejeweled utsava murthi of Sri Kodandarama on the four mada streets of the temple.As per Vaikhanasa Agama at all Vaishnavite temples,Pournami, Amavasya, Shukla Ekadasi Sravana, punarvasu star days were held very significant .

Among others Local temples Dy EO Smt Varalakshmi, temple Supderintedent Sri Munikrishna Reddy, temple Inspector Sri K Sesha Reddy , Sri Muralikrishna and temple priests etc participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా సహస్ర కలశాభిషేకం

తిరుపతి, 18 నవంబరు 2017 ; తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఉదయం 6.00 నుండి 8.00 గంటల వరకు సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది.

కాగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ వరలక్ష్మి, సూపరిండెంట్‌ శ్రీమునికృష్ణరెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళికృష్ణ, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.