TTD APPEALS TO PILGRIMS NOT TO BELIEVE IN FAKE WEBSITES_ అధికారిక వెబ్‌సైట్లలోనే దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోండి నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోకండి : టిటిడి
Tirumala, 5 Feb. 20: Tirumala Tirupati Devasthanams has appealed to Srivari devotees not to believe and get cheated by fake websites and only log into TTD official websites only for booking rooms, darshan tickets etc.
Based on the complaints of pilgrims the Vigilance wing of TTD has already already lodged criminal case against these fake websites.
tirupatibalaji.ap.gov.in and ttdsevaonline.com to book darshan and accommodation while www.tirumala.org for TTD related news.
Meanwhile TTD has booked criminal cases on the following website.
1.www.ttdtickets.com, 2.www.ttddarshan.com,
4.tirupatibalajidarshanbooking.com,
- bookingtirupatidarshan.com,
- www.templeyatri.com,
- tirupatibalajitemple.com,
- www.tirupatibalajidarshanbooking.co.in,
- tirupatitourism.in,
- tirupatitourismseva.com,
- padmavathitravels.in, 17.ttddarshan.com,
- tirupatibalajidarshanbooking.co.in,
18. tirupatibalajidarshanbooking.co.in
19.tirupatidarshanbooking.org.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అధికారిక వెబ్‌సైట్లలోనే దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోండి
నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోకండి : టిటిడి
ఫిబ్రవరి 05, తిరుమల 2020: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది.
నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్టు పలువురు భక్తుల నుండి టిటిడికి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అధికారులు సదరు నకిలీ వెబ్‌సైట్లపై పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. వీటిపై విచారణ జరుగుతోంది.
శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారికంగా tirupatibalaji.ap.gov.in మరియు ttdsevaonline.com వెబ్‌సైట్లు మాత్రమే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించిన సమాచారం కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
కాగా, టిటిడి గుర్తించిన నకిలీ వెబ్‌సైట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులు ఈ వెబ్‌సైట్లను నమ్మవద్దని టిటిడి కోరుతోంది. 1.www.ttdtickets.com, 2.www.ttddarshan.com, 3.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.