KALYANOTSAVAM IN SRI KODANDARAMALAYAM ON OCTOBER 21 _ అక్టోబ‌రు 21న తిరుప‌తిలోని శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

Tirupati 19 oct 19 ; The celestial Sita Rama Kalyanam will be observed on October 21 in Sri Kodanda Rama Swamy temple in Tirupati.

On the advent of Punarvasu Nakshatram, the Kalyanotsavam will be performed in the temple by 11am on that day.

In the evening, the utsavarulu will be taken along four mada streets and later unjal seva will be performed in Ramachandra Pushkarini. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

 అక్టోబ‌రు 21న తిరుప‌తిలోని శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

తిరుపతి, 2019 అక్టోబ‌రు 19 ;తిరుప‌తిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 21వ తేదీ ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.