KALYANOTSAVAM PROJECT PLAYING VITAL ROLE IN PROPAGATING SRI VENKATESWARA BHAKTI CULT _ తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అఖండంగా శ్రీవారి వైభవం
weddings and the venues should have some mythological importance or
may be prominent cultural or spiritual centres of vedic importance.
downtrodden classes people reside
only as approved by OSD KSUP alone.
తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అఖండంగా శ్రీవారి వైభవం
తిరుమల, మార్చి 20, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి భక్తుల మదిలో భక్తిభావాన్ని నింపాలన్న లక్ష్యంతో 2012, జనవరి నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కల్యాణోత్సవ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ శ్రీ కల్యాణోత్సవ ప్రాజెక్టు హిందూ ధర్మప్రచార పరిషత్లో ఒక విభాగంగా ఏర్పాటైంది. భగవంతుని భక్తుల ముంగిట సాక్షాత్కరింపజేయడమే ధ్యేయంగా నిర్వహిస్తున్న శ్రీనివాసకల్యాణాలు, గోవింద కల్యాణాలు ఈ ప్రాజెక్టు ద్వారానే నిర్వహించబడుతున్నాయి.
తిరుపతిలోని మాధవం అతిథి గృహంలో ప్రారంభించబడిన ఈ కల్యాణోత్సవ ప్రాజెక్టు నేతృత్వంలో సంవత్సరంలో 50 శ్రీనివాస కల్యాణాలు, 100 గోవింద కల్యాణాలు నిర్వహించబడతాయి. ఇప్పటికే 97 శ్రీనివాస కల్యాణాలను, 17 గోవింద కల్యాణాలను ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అమెరికా, కెనడా, నేపాల్ వంటి విదేశాల్లో కూడా శ్రీనివాస కల్యాణాలను, గోవిందకల్యాణాలను తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు దిగ్విజయంగా నిర్వహించడమైనది.
శ్రీనివాస కల్యాణాలను లేదా గోవిందకల్యాణాలను నిర్వహించదలచిన వ్యక్తులు గానీ, సంస్థ గానీ అనుసరించవలసిన నిబంధనలు:
1. ఈ పరమ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలను తమ ప్రదేశంలో నిర్వహించ తలపెట్టిన నిర్వాహకులు గానీ లేదా నిర్వాహక సంస్థ గానీ ఎటువంటి లాభాపేక్షను ఆశించరాదు.
2. వీరికి ఎటువంటి రాజకీయ పక్షాలతో ప్రమేయం ఉండకూడదు.
3. ఆ వ్యక్తిగానీ లేదా ఆ సంస్థగానీ ఎటువంటి వివాదాల్లోనూ, న్యాయపరమైన సమస్యల్లోనూ ఉండరాదు.
4. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ ధర్మప్రచారాన్ని థదిశలా వ్యాపింపచేయడమే లక్ష్యంగా రూపొందించబడినవి కనుక కేవలం తదనుగుణంగా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది.
5. తితిదే ఈ కార్యక్రమాలకు సంబంధించి నిర్వహించే హోమం, ఉత్సవమూర్తులకు అలంకరించే పుష్పాలు, అర్చకుల సంభావన, తితిదే వాహనాలకు ఇంధన ఖర్చులకు మాత్రమే తితిదే ఆర్థిక సహకారం అందిస్తుంది.
6. హిందూ ధర్మప్రచార పరిషత్ శ్రీవారి పుస్తక ప్రసాదాలను, జేబు పరిమాణం దేవతామూర్తుల చిత్రపటాలు అందిస్తే, కల్యాణోత్సవం ప్రాజెక్టు అమ్మవారి కుంకుమ భరిణలను పరిధి మేరకు మహిళా భక్తులకు అందజేస్తుంది.
7. ఈ కార్యక్రమాలను తితిదే ఎస్వీ భక్తి చానల్లో సమయానుకూలంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది.
8. నిర్వాహకులు ఎటువంటి ప్రసాదాలను భక్తులకు విక్రయించరాదు. ఒకవేళ తితిదే శ్రీవారి లడ్డూ ప్రసాదాలను నిర్ణీత సంఖ్యలో తీసుకొస్తే ఆ ప్రసాదాన్ని తితిదే అధికారిక ధరలకే భక్తులకు విక్రయించాల్సి ఉంటుంది.
9. నిర్వాహకులు ఈ కల్యాణాలను లాభాపేక్షతో మలిచే ప్రయత్నం చేస్తే అంటే భక్తుల వద్ద నుండి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తే తితిదే తీవ్రమైన చర్యలను వారిపై చేపడుతుంది. ఇది కేవలం భక్తిప్రచారానికి ఉద్దేశించిన కార్యక్రమం మాత్రమేనని సుస్పష్టం చేయడమైనది.
10. నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే తితిదే సిబ్బందికి ఎటువంటి మూల్యాన్ని చెల్లించవలసిన అవసరం లేదు. అయితే సిబ్బందికి ఆయా ప్రదేశాల్లో తగిన వసతిని ఏర్పాటు చేయగలరు.
11. తితిదే ఏర్పాటుచేసిన ఈ నియమ నిబంధనలను తప్పకుండా నిర్వాహకులు అనుసరించాల్సి ఉంటుంది.
12.శ్రీవారి భక్తి ప్రచారంలో భాగస్వాములు కాదలచిన ప్రయివేటు చానళ్లు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కల్యాణాల ప్రసారాలను వివరాలను ఒకవారం ముందుగా తమ చానళ్లలో ఉచితంగా ప్రసారం చేయవచ్చు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.