KARTHIKA DEEPOTSAVAM IN LOCAL TEMPLES _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం
TIRUPATI, 18 NOVEMBER 2021: Karthika Deepotsavam was observed in Sri Govinda Raja Swamy temple and Sri Kodanda Rama Swamy temples on
Thursday.
Due to covid restrictions, this festival was observed in Ekantam in both the temples.
Tirumala Sri Chinna Jeeyar Swamy and Special Grade DyEOs of the respective temples, Sri Rajendrudu, Smt Parvathi and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం
తిరుపతి, 2021 నవంబరు 18: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఏకాంతంగా జరిగింది. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి బాలాలయంలోని శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కామరాజు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామాలయంలో
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం సాయంత్రం కార్తీక దీపోత్సవం ఏకాంతంగా జరిగింది. సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకొచ్చారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్ కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జయకుమార్ పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.