KARVETINAGARAM VASANTHOTSAVAMS _ ఏప్రిల్ 11 నుండి 13వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

TIRUPATI, 07 APRIL 2023: The annual Vasanthotsavams in Sri Venugopala Swamy temple at Karvetinagaram will be observed between April 11-13.

 

Every day there will be dharmic and devotional cultural programmes by TTD on the occasion at the temple premises.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 11 నుండి 13వ తేదీ వరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి, 2023 ఏప్రిల్ 07: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 11 నుండి 13వ తేదీ వరకు జరుగనున్నాయి.  

ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు.  ఇందులో భాగంగా పసుపు, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ధార్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.