KAT IN PAT _ న‌వంబ‌రు 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tiruchanoor 04 Nov 2019 ; The traditional temple cleaning festival, Koil Alwar Tirumanjanam will be observed in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on November 19 in connection with annual brahmotsavams which commences from November 23.

This fete will be observed in the temple from 6am to 10am.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

న‌వంబ‌రు 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 నవంబరు 04: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 23 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 19వ తేదీ మంగ‌ళ‌వారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహిస్తారు.

 అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కార‌ణంగా కుంకుమార్చ‌న‌తోపాటు ఆల‌యంలో అన్ని ఆర్జిత‌సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు.

 న‌వంబ‌రు 22న అంకురార్ప‌ణ
      శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు న‌వంబరు 22వ తేదీన అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్య‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.బ్రహ్మూెత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ                                     ఉదయం                                       రాత్రి

23-11-2019(శనివారం)      ధ్వజారోహణం                           చిన్నశేషవాహనం

24-11-2019(ఆదివారం)   పెద్దశేషవాహనం                       హంసవాహనం

25-11-2019(సోమవారం)   ముత్యపుపందిరి వాహనం              సింహవాహనం

26-11-2019(మంగళవారం)  కల్పవృక్ష వాహనం                     హనుమంతవాహనం

27-11-2019(బుధవారం)   పల్లకీ ఉత్సవం                                    గజవాహనం

28-11-2019(గురువారం)    సర్వభూపాలవాహనం       స్వర్ణరథం, గరుడవాహనం

29-11-2019(శుక్రవారం)    సూర్యప్రభ వాహనం                    చంద్రప్రభ వాహనం

30-11-2019(శనివారం)        రథోత్సవం                                   అశ్వ వాహనం

01-12-2019(ఆదివారం)     పంచమితీర్థం                                   ధ్వజావరోహణం.

 02-12-2019(సోమవారం)                ——-     సాయంత్రం – పుష్పయాగం.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.