PAVITROTSAVAMS COMMENCE IN SRI KT

Tirupati, 5 July 2017: The three day pavitrotsavams commenced on a ceremonial note in Sri Kapileswara Swamy temple on Wednesday.

The processional deities of Panchamurthies including Sri Somaskandamurthi, Kamakshi Devi, Sri Vighneswara Swamy, Valli Devasena Sametha Sri Subrahmanya Swamy, Sri Chandikeswara Swamy were rendered celestial snapana tirumanjanam with milk, curd, nectar, sandalpaste, turmeric, vibhuti and tender coconut water in Kalyana Mandapam.

As a part of pavitrotsavams on the first day evening Kalasapuja, homam, Pavitra Pratishta were performed. The grihasta devotees who took part in this fete paying Rs.500 were offered one laddu prasadam, uttariyam, blouse piece and on the last day they will be presented pavitramala.

Temple DyEO Sri Subrahmanyam, AEO Shankar Raju and other office staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2017 జూలై 05: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం చేశారు. ఉదయం 9.00 నుండి 12.00 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, విభూది, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పవిత్రోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గ హస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకరరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ఓబుల్‌రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ స్వామినాథన్‌ స్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉదయస్వామి ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.