DHWAJAROHANAM MARKS THE GRAND OPENING OF VONTIMITTA BTUs_ ఒంటిమిట్టలో ధ్వజారోహణంతో వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Vontimitta, 25 March 2018: The annual brahmotsavams in the ancient TTD taken over temple of Sri Kodanda Rama Swamy at Vontimitta in Kadapa district, off to a ceremonial start with Dhwajarohanam in Vrishabha Lagnam at 9:03am on Sunday.

The nine day festival will last up to April 2. Navakalasa Panchamritabhishekam was performed to the Dhwajasthambham and Garuda Dhwaja was hoisted on the temple Pillar.

AP Ministers Sri Somireddi Chandramohan Reddy, Sri Adi Narayana Reddy and Government Whip Sri M Mallikarjuna Reddy took part in celestial fete. Earlier tgey were accordede traditional welcome by temple authorities. Later they had darshan of Lord.

Speaking on this occasion, the honourable ministers said, the AP government is keen to develop the temple on the lines of Bhadrachalam. They said, TTD is making elaborate arrangements for the divine wedding on March 30.

MINISTERS COMMENCE PREPARATION OF “TALAMBRALU”

Meanwhile the ministers commenced preparation pf “Mutyala Talambralu” for celestial wedding. About 380 srivari sevakulu took part in the service. They prepare 2lakh packets for the occasion.

BOOK RELEASED

In connection with Potana Jayanthi on Sunday, “Sri Ramaneeyakam” a book by Sri Vidwan Katta Narasimhulu was released by the ministers under the aegis of Potana Sahitya Peetham.

DyEOs Smt Goutami, Vijayasaradhi, PRO Dr T Ravi were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఒంటిమిట్టలో ధ్వజారోహణంతో వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తలంబ్రాల తయారీని ప్రారంభించిన

గౌ|| రాష్ట్ర మంత్రులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీ ఆదినారాయణరెడ్డి

ఒంటిమిట్ట, 2018 మార్చి 25: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.03 గంటలకు పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన కంకణబట్టర్‌ శ్రీరాజేష్‌కుమార్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.

తలంబ్రాల తయారీని ప్రారంభించిన గౌ|| రాష్ట్ర మంత్ర్రులు:

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం కార్యక్రమానికి గౌ|| రాష్ట్ర మంత్రులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీ ఆదినారాయణరెడ్డి విచ్చేశారు. ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని గౌ|| మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గౌ|| రాష్ట్ర మంత్రులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీ ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయన్నారు. మార్చి 30న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయాన్ని భద్రాచలం తరహాలో అభివృద్ధి చేసేందుకు టిటిడి కృషి చేస్తోందన్నారు. ధర్మప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి టిటిడి సహకారం అందిస్తోందని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకారులకు అర్చక శిక్షణ ఇచ్చి ఆయా ఆలయాల్లో అర్చకులుగా నియమిస్తుండడం ముదావహమన్నారు.

అనంతరం బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారుచేశారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి ఆధ్వర్యంలో 380 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.

”శ్రీరామణీయకం” ప్ర్రత్యేక సంచిక ఆవిష్కరణ :

ఒంటిమిట్టలోని పోతన సాహిత్య పీఠం ఆధ్వర్యంలో విద్వాన్‌ కట్టా నరసింహులు రచించిన ”శ్రీరామణీయకం” ప్రత్యేక సంచికను శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా గౌ|| రాష్ట్ర మంత్రులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీ ఆదినారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఇందులో ఒంటిమిట్టను ఆశ్రయించిన శ్రీ బమ్మెర పోతన, శ్రీ అయ్యలరాజు తిప్పయ్య, శ్రీ రామభద్రకవి, శ్రీ వావిలికొలను సుబ్బారావు రచనలకు సంబంధించిన 32 వ్యాసాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు 32 మెట్లు ఉన్నాయని, రంగమంటపంలో 32 స్తంభాలున్నాయని, స్వామివారికి 32 రకాల అర్చనలు జరుగుతాయని, ఈ కారణంగానే 32 వ్యాసాలతో ప్రత్యేక సంచికను రూపొందించానని సంపాదకులు విద్వాన్‌ కట్టా నరసింహులు తెలిపారు.

బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్‌ శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

కవి సమ్మేళనం :

పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది. ఈ సందర్భంగా పోతన వ్యక్తిత్వం, భాగవత విశిష్టత, పోతన భక్తిత్వం, జనప్రియ రామాయణం, రాయామణ కల్పవృక్షం తదితర అంశాలపై ప్రముఖ కవులు సమ్మేళనం నిర్వహిస్తారు.

కాగా, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు శేషవాహనంపై స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు శ్రీ సిఎం.రమేష్‌, ఎంఎల్‌సి శ్రీ రామసుబ్బారెడ్డి, రాజంపేట ఆర్‌డివో శ్రీ వీరబ్రహ్మం, టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ విజయసారథి, శ్రీ దేవేంద్రబాబు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎ.రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి డా|| రమణప్రసాద్‌, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.