KEEP MENTALLY AND PHYSICALLY FIT WITH SPORTS AND GAMES-JEO TO EMPLOYEES_ క్రీడలతోనే శారీరక, మానసిక ప్రశాంతత : జెఈ”వో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirupati, 1 February 2018: Terming Sports and Games as elixir to body and soul, Tirumala JEO Sri KS Sreenivasa Raju advocated that all employees should play to keep themselves fit enough to discharge their duties with utmost capabilities.

Inaugurating the TTD Sport and Games Meet on Thursday in the parade grounds behind TTD Administrative building in Tirupati on Thursday, the JEO who graced the occasion as Chief Guest said, every one should chose a sport which not only provides stamina to the body but also keeps mind fresh. “By playing games, it enhances our sportive spirit”, he observed.

CVSO Sri A Ravikrishna said, every year TTD observes sports and games meet on part with any other festival and involves all the employees.

Welfare Department DyEO Smt Snehalatha, said, TTD has commenced this activity in 1977. “We have separates games and sports categories for men-women below 40years, 41-50years, 50 above, retired, physically challenged also. Those who stand in first, second and third places will be given gift vouchers worth Rs.1800, Rs.1600 and Rs.1400 respectively”, she added.

VGO Sri Ashok Kumar Goud, AVSO Sri Gangaraju and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

క్రీడలతోనే శారీరక, మానసిక ప్రశాంతత : జెఈ”వో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఘనంగా టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు-2018 ప్రారంభం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 01: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా భక్తులకు విశేష రీతిలో సేవలు అందించడానికి క్రీడలు దోహదపడతాయని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్‌ మైదానంలో ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు -2018 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి కట్టుబడి ఉందని, ఇందుకోసం అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. ఉద్యోగులు ప్రతిరోజూ దైనందిన జీవనంలో కొంత సమయం ఏదో ఒక క్రీడను సాధన చేయాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు విధుల్లోనూ చురుగ్గా ఉంటారని అన్నారు. క్రీడాస్ఫూర్తితో విధులను నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులందరూ పాల్గొని క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని జెఈవో కోరారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ చక్కటి ఆరోగ్యం కోసం క్రీడలు తప్పనిసరి అన్నారు. పండుగ వాతావరణంలో క్రీడోత్సవాలు నిర్వహించాలన్నారు.

టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత మాట్లాడుతూ టిటిడిలో 1977వ సంవత్సరంలో క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈసారి పురుషులు, స్త్రీల విభాగంలో 40 సం||రాల లోపువారికి, 41 నుంచి 50 సం||లోపువారికి, 50 సం||రాల పైబడిన వారికి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు, దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. క్రీడాపోటీల్లో మొదటిస్థానం పొందినవారికి రూ.1800/-, రెండో స్థానం పొందినవారికి రూ.1600/-, మూడో స్థానం పొందినవారికి రూ.1400/- విలువగల గిఫ్ట్‌వోచర్‌లు బహుమతులుగా అందిస్తామన్నారు. పురుషుల విభాగంలో వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, కబడ్డీ, మహిళల విభాగంలో టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జిబాల్‌, కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

ముందుగా జాతీయ జెండాను జెఈవో, క్రీడోత్సవాల జెండాను సివిఎస్‌వో ఆవిష్కరించి శాంతికపోతాలను, బెలూన్లను ఎగురవేశారు. ముందుగా పలు విభాగాల ఉద్యోగులు కవాతు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రార్థన చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, ఫిజికల్‌ డైరెక్టర్‌ డా|| పెన్నా భాస్కర్‌, అన్ని విభాగాల ఆధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

టిటిడి ఉద్యోగుల క్రీడలు తిరుపతిలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గురువారం టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్‌ మైదానంలో బాల్‌ బ్యాడ్మింటన్‌, చెస్‌, డాడ్జిబాల్‌ పోటీలు నిర్వహించారు.

40 ఏళ్లలోపు మహిళల బాల్‌ బ్యాడ్మింటన్‌లో జి.రజని జట్టు విజయం సాధించగా, ఎన్‌.జ్ఞానశశి జట్టు రన్నరప్‌గా నిలిచింది.

50 ఏళ్లు పైబడిన మహిళల చెస్‌ పోటీల్లో ఆర్‌ఎంవో డా|| జి.పద్మావతి గెలుపొందగా, సూపరింటెండెంట్‌ సి.కనకవళ్లి రన్నరప్‌గా నిలిచారు.

41 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల డాడ్జిబాల్‌ పోటీల్లో సూపరింటెండెంట్‌ వడ్లమూడి నిర్మల విజేతగా నిలవగా, సానంరెడ్డి కల్పన రన్నరప్‌గా నిలిచారు.

40 ఏళ్ల లోపు పురుషుల వాలీబాల్‌ పోటీల్లో యు.ధనంజయరావు జట్టు, ఆర్‌.బాలాజిసింగ్‌ జట్టు ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.