KODANDARAMA TEPPOTSAVAMS _ ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ కోదండ రాముని తెప్పోత్సవాలు
TIRUPATI, 29 MARCH 2023: The annual Teppotsavams in Sri Kodandarama Swamy temple will be held from April 3 to 5 at Ramachandra Pushkarini in Tirupati.
Everyday evening, the utsava murthies will take ride on the finely decked float between 7pm and 8.30pm. On these three days, there will be Snapana Tirumanjanam between 8am and 9.30am.
The deities will take a celestial ride on the Teppa on first day three rounds, second day five rounds and on the final day seven rounds and bless devotees.
ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ కోదండ రాముని తెప్పోత్సవాలు
తిరుపతి, 2023 మార్చి 29: తిరుపతి లోని శ్రీకోదండరామ స్వామి వారి తెప్పోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి .
ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు స్వామివారు తెప్పలపై విహరిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది