KOIL ALWAR TIRUMANJANAM AT SRI PVT, APPALAYAGUNTA_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 11 Jun. 19: As a part of annual Brahmotsavams from June 13 to 21, the Agama ritual of Koil Alwar Tirumanjanam was performed at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta on Tuesday.

TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmi Kantham took part in this traditional cleansing fete of the temple.

The devotees were given darshan from 11.30 am after the completion of the Koil Alwar Tirumanjanam where the temple was cleaned with herbs and an aromatic liquid mixture called “Parimalam”.

TTD plans to conduct Ankurarpanam on June 12, Dwajarohanam on June 13. Other events are as follows; Simha vahanam June 15, Kalpavruksa vahanam and Kalyanotsavam June 16, Garuda vahanam June 17, Hanumanta vahanam June 18, Rathotsavam June 20, Chakra Snanam and Dwajavarohanam June 21.

The devotees could participate in the Kalyanotsavam with payment of ₹500 and beget one uttarium, one blouse, one laddu, one appam, Anna Prasadam and blessings.

The cultural wings of TTD, HDPP and Dasa Sahitya Project will render Bhakti sangeet, bhajans, kolatas etc. during Brahmotsavams.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Temple Inspector Sri K Srinivasulu and others participated.
gallery link=”file” columns=”4″ ids=”69009,69010,69011,69012,69013,69014,69015,69016″ orderby=”rand”]
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి, 2019 జూన్ 11: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో జూన్ 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

జూన్ 12న అంకురార్పణ

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు జూన్ 12వ తేదీ బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

జూన్ 13న ధ్వజారోహణం

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13న గురువారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య కర్కాటక లగ్నంలో సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

13-06-2019(గురువారం) ధ్వజారోహణం(కర్కాటక లగ్నం) పెద్దశేష వాహనం

14-06-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

15-06-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-06-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

17-06-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

18-06-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం

19-06-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-06-2019(గురువారం) రథోత్సవం అశ్వవాహనం

21-06-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.