TIRUMALA TEMPLE SETS READY TO WELCOME “UGADI LAKSHMI”_ ”ఉగాది లక్ష్మి”ని ఆహ్వానించడానికి ముస్తాబైన తిరుమల

Tirumala, 16 March 2018: The entire premises of Tirumala temple has been spruced up to welcome “Ugadi Lakshmi” on Sunday on the occasion of Sri Vilambi Nama Ugadi.

After the temple court – Ugadi Asthanam at Bangaru Vakili in which Utsavarulu and Vishwaksenulavaru are seated, Panchanga Sravanam will be recited.

On this celestial occasion, the deities including mula virat will be decorated with new set of clothes. Later prasadam will be distributed.

TTD has cancelled arjitha sevas including Kalyanotsavam, Dolotsavam, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasra Deepalankara Seva on Sunday in view of Ugadi.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

”ఉగాది లక్ష్మి”ని ఆహ్వానించడానికి ముస్తాబైన తిరుమల

మార్చి 16, తిరుమల 2018: ఈ నెల 18వ తేదీ ఆదివారంనాడు ఉగాది పర్వదినాన్ని నిర్వహించేందుకు తిరుమల దివ్యక్షేత్రం శోభాయమానంగా ముస్తాబు అవుతున్నది.

తెలుగువారి సంవత్సరాదియైన శ్రీ విలంబినామ ఉగాదిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం, పరిసరాలను పచ్చని పందిళ్ళతో, రంగవల్లులతో, దేదీప్యమానమైన విద్యుద్దీపాలతో, వివిధ రకాల పుష్పాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, శుద్థి నిర్వహించి అనంతరం తోమాలసేవను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ నిర్వహిస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్థంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 18వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.