NO SCOPE FOR INCONVENIENCE IN LADDU DISTRIBUTION ON G-DAY_ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా ల‌డ్డూ ప్ర‌సాదాలు – శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌

Tirumala, 11 Sep. 19: Keeping in view the past year experience, this year the laddu distribution process need to be carried out in a very smooth manner during brahmotsavams especially on Garuda Seva day and for that all the departments should extend their co-operation and render services with more devotion, said Temple DyEO Sri Harindranath.

A review meeting on the distribution of laddus took place in the meeting hall in PAC 4 on Wednesday evening with Temple (laddu), Vigilance, Srivari Seva and Banks. The officers discussed in length on how to overcome the technical issues and the alternative measures to avoid any sort of inconvenience to the pilgrims in the distribution of laddus during the nine-day festival with special focus on Garudotsavam.

VGOs Sri Manohar, Sri Prabhakar, AEO Potu Sri Srinivas, AVSOs of all the four sectors in Tirumala, Bank representatives, supervisors of Laddu Counters, Superintendents and other office staffs of Laddu wing were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా ల‌డ్డూ ప్ర‌సాదాలు – శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌

తిరుమల, 2019 సెప్టెంబర్ 11: శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలలో తిరుమ‌లకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంత‌రాయంగా ల‌డ్డూ ప్ర‌సాదాలు పంపిణీకి ప‌టిష్ఠమైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ తెలిపారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లోని స‌మావేశ మందిరంలో బుధ‌వారం శ్రీ‌వారి ఆల‌యం, పోటు, విజిలెన్స్‌, బ్యాంక్ అధికారుల‌ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో ముఖ్యంగా గ‌రుడ‌సేవ‌నాడు ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీలో ఏదైన సాంకేతిక స‌మ‌స్య ఎదురైతే, ప్ర‌త్య‌మ్నాయ చ‌ర్య‌ల‌పై స‌మాలోచ‌న‌లు చేశామ‌న్నారు. ల‌డ్డూ కౌంట‌ర్ల‌కు అద‌నంగా మ‌రో ఇంట‌ర్‌నెట్ లైన్, సాంకేతిక సిబ్బందితో టీంను ఏర్పాటు చేయాల‌న్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యం, ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా విధులు నిర్వ‌హించాల‌ని సిబ్బందిని కోరారు.

ఈ స‌మావేశంలో టిటిడి విజివోలు శ్రీ మ‌నోహ‌ర్, శ్రీ ప్ర‌భాక‌ర్‌, పోటు ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు, ఏవిఎస్వోలు, వివిద బ్యాంక్‌ల ప్ర‌తినిధులు, ల‌డ్డూ కౌంట‌ర్ల సూప‌ర్‌వైజ‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.