MAKE TTD LOCAL TEMPLE DEVOTEE FRIENDLY- JEO_ అనుబంధ ఆలయాలను ఎక్కువ మంది దర్శించుకునేలా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌

Tirupati, 11 Sep. 19: TTD Joint Executive Officer Sri P. Basant Kumar directed officials to initiate measures in TTD local temples to attract more number of devotees.

Speaking at a review meeting on development works like off-line and on-line Arjita sevas, security, engineering works and publicity in TTD local temples in TTD administrative building on Wednesday, the JEO asked the officials to prepare a documentary on the significance of TTD local temples and telecast in SVBC channel.

TTD Chief Engineer, Sri Ramachandra Reddy, Additional CVSO Sri Siva Kumar Reddy, SE-1 Sri Ramesh Reddy, SE-2 Sri Ramulu, SE (electrical) Sri Venkateswarlu, DFO Sri Phani Kumar Naidu, Chief Audit Officer Sri Sesha Shailendra and other local temple DyEOs participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అనుబంధ ఆలయాలను ఎక్కువ మంది దర్శించుకునేలా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌

తిరుపతి, 2019 సెప్టెంబరు 11: తిరుపతి, ఇతర ప్రాంతాల్లోని అనుబంధ ఆలయాలను మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై బుధవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆయా ఆలయాల్లో ఆర్జితసేవలు(ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌), అవసరమైన సిబ్బంది, భద్రత, ఇంజినీరింగ్‌ పనులు, ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్‌ అధికారులు, సంబంధిత డెప్యూటీ ఈవోలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఆలయాల ప్రాశస్త్యంపై డాక్యుమెంటరీలు రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం ఇతర అనుబంధ ఆలయాలు, శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ఇతర అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం ఇతర అనుబంధ ఆలయాలు, ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర అంశాలపై జెఈవో సమీక్షించారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ-3 శ్రీ రాములు, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, చీఫ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ శ్రీ శేష శైలేంద్ర, ఆయా ఆలయాల డెప్యూటీ ఈవోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.