LADDU PREPARATION RESUMES IN BOONDI POTU ON MARCH 29 -TIRUMALA JEO_ మార్చి 29 నుండి తిరుమలలోని బూందీ పోటులో బూందీ తయారీ – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 28 March 2018: The preparation of laddus in boondi Potu will re resume from March 29, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Speaking to media at Tirumala on Wednesday evening the JEO said, a minor fire brokeout in boondi potu located outside srivari temple as the fire caught ghee deposited on the walls and roof of the boondi potu.

The fire fighting team quickly responded and controlled the flames. We take up the cleaning works of boondi potu twice a month regularly on every pournami and Amavasya. The preparation of laddus will resume from tomorrowmorning”, he maintained.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 29 నుండి తిరుమలలోని బూందీ పోటులో బూందీ తయారీ – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 28 మార్చి, 2018: తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూంది పోటులో మార్చి 29వ తేది గురువారం ఉదయం నుండి బూందీ తయారు చేయనున్నట్లు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలోని బూంది పోటులో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. మంటలను అదుపుచేసిన అనంతరం జెఈవో తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ పోటులోని పైకప్పులకు, గోడలకు అంటుకున్న నెయ్యి జిడ్డు వల్ల మంటలు అంటుకున్నాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయంలో మంటలను అదుపులోనికి తీసుకువచ్చినట్లు వివరించారు.

ప్రతినెల పౌర్ణమి, అమావాస్యలకు పోటులో మాస్‌ క్లినింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి అస్తి నష్టం సంభవించలేదని జెఈవో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.