LAKSHA KUMKUMARCHANA OBSERVED_తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన

Tiruchanoor, 3 December 2018: As a part of the Annual Brahmotsavams at Sri Padmavati Ammavari Temple in Tiruchanoor, Laksha Kukumarchana was performed in a grand manner on Monday.

Kumkuma or the vermilion has a most significant place in Hindu religion and Kumkuma implies Stree Shakti as it symbolically represented as the combination of Lakshmi, Saraswati and Parvathi.

Conduction of Laksha Kukumarchans as a prelude to Brahmotsavam is an age old practice at the Sri Padmavati Ammavari temple.

Archakas performed the prestigious and sacred ritual at Sri Krishna Mukha mandapam inside the temple between 8am and 12 noon and hundreds of women devotees took part in the fete.

They recited Lakshmi Astottaram, Lakshmi Sahasranamam on this celestial occasion.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, other archakas, officials and devotees participated in the event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన

తిరుపతి, 2018 డిసెంబరు 03: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.

హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలవబడుతున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి అష్టోత్తరం, లక్ష్మి సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా అంకురార్పణ :

కాగా, సాయంత్రం 6.00 నుంచి 8.30 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

డిసెంబరు 4న ధ్వజారోహణం :

ఆలయంలో మంగళవారం ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, ఉదయం 8.30 నుండి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 8.00 నుంచి 11.00 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.