LAP TOP GIFTED TO BALAMANDIR FORMER STUDENT _ ఎస్వీ బాలమందిర్ విద్యార్థికి తితిదే ల్యాప్‌టాప్ బహూకరణ
ఎస్వీ బాలమందిర్ విద్యార్థికి తితిదే ల్యాప్‌టాప్ బహూకరణ
తిరుపతి, మార్చి 29, 2013: తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీ బాలమందిర్ విద్యార్థి జి.రఘువంశికి తితిదే విద్యాశాఖాధికారి శ్రీ శేషారెడ్డి శుక్రవారం ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. అనాథ అయిన రఘువంశి శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరు సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూరులోని నేషనల్ రీసర్చి డిజైన్ సంస్థకు ఇతడు ”సోలార్ టెక్నాలజి ఫర్ రూరల్ డెవలప్‌మెంట్” అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించాడు. ఇందుకుగాను కర్ణాటక గవర్నర్ చేతులమీదుగా అవార్డును సైతం అందుకున్నాడు. ఇందులో సోలార్ టెక్నాలజి ద్వారా రూ.7 లక్షల వ్యయంతో 15 సంవత్సరాల పాటు 30 కుటుంబాలు గల గ్రామానికి అవసరమైన గృహ, వ్యవసాయ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశముందని నిరూపించాడు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ సుధాకర్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.