STATE WIDE LIBRARIES TO HOUSE TTD PUBLICATIONS-TIRUPATI JEO_ గ్రంథాలయాలకు టిటిటి ఆధ్యాత్మిక పుస్తకాలు: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 24 May 2018: The TTD publications will be distributed to all libraries present across the state, said TTD Tirupati JEO Sri P Bhaskar.

A review meeting was held at SPRH in Tirupati on Thursday with officials concerned. Speaking to them the JEO said, already TTD publications including Ramayanam, Maha Bharatam, Bhagavatam, Srivari Leela were kept ready to dispatch to these libraries free of cost. Besides, we should also send our calendars and Panchangam, he opined.

He directed the officials to come out with an action plan and instructed the CE Sri Chandrasekhar Reddy to come with the estimates plan to set a separate rack to keep spiritual publications in these libraries.

Assistant Director of Libraries Sri Srinivas, Publications special officer Sri Anjaneyulu, DyEO Sales wing Sri Hema chandra Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ్రంథాలయాలకు టిటిటి ఆధ్యాత్మిక పుస్తకాలు: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

మే 24, తిరుపతి, 2018: ప్రజలలో భక్తి భావం, ధార్మికతను మరింత పెంచేందుకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలలో టిటిడి ఆధ్యాత్మిక పుస్తకాలను ఉంచేందుకు వీలుగా స్పిర్చువల్‌ ర్యాక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రంథాలయాల అధికారులను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కోరారు. 13 జిల్లాల గ్రంథాలయాల అధికారులతో గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి తిరుపతి జెఈవో మాట్లాడుతూ టిటిడి వివిధ భాషలలో వేలాది ఆధ్యాత్మిక పుస్తకాలను ముద్రిస్తోందని, ఇవన్నీ టిటిడి కేంద్రీయ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రంథాలయాలకు ఉచితంగా అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టిటిడి ముద్రించిన భాగవతం, భారతం, రామాయణం, శ్రీవారి లీలలు తదితర గ్రంథాలు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వీటితోపాటు టిటిడి పంచాంగం, క్యాలెండర్లును ఆయా లైబ్రరీలకు పంపాల్సిన అవసరాన్ని అధికారులకు తెలియజేశారు.

ఆయా ప్రాంతాలలో ఎక్కువగా పాఠకులు సందర్శించే లైబ్రరీల వివరాలను, అక్కడ ఉన్న సౌకర్యాలను ఈ సమావేశానికి వచ్చిన 13 జిల్లాల అధికారులు జెఈవోకు వివరించారు. ఈ అంశాలపై జెఈవో స్పందిస్తూ ఆయా లైబ్రరీలలో ఆధ్యాత్మిక ర్యాక్‌లు ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాలు, వాటికి అయ్యే ఖర్చు వివరాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయి, లైబ్రరీలలో ఎన్ని ర్యాక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, వీటన్నిటి వివరాలను తెప్పించుకుని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌కు నివేదికను సమర్పిస్తామని ఆయన ఆన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో (సేల్స్‌ వింగ్‌) శ్రీ హేమచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. ఆంజనేయులు తదితర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.