SSD COUNTERS IN TIRUMALA TO REOPEN FROM SATURDAY-JEO_ మే 26 నుండి తిరుమల, తిరుపతిలో నిర్ణీత సంఖ్యలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ : తిరుమల జెఈవో

Tirumala, 24 May 2018: The Sarva Darshan Token issuing Counters which were closed on Tuesday sowing to unprecedented turn out of pilgrims, will reopen from Saturday at zero hours, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Addressing media persons at Annamaiah Bhavan in Tirumala on Thursday evening, the JEO said, TTD has introduced Sarva Darshan Token system to avoid long waiting hours by pilgrims in queue lines and compartments. But due to mid summer rush, the darshan time reached 72hours and TTD has closed the counters at Tirumala on 22nd May immediately.

The JEO said a detailed review meeting with IT and Vigilance wings was conducted at Gokulam rest House conference hall. It has been decided that similar to Special Entry and Divya Darshan systems, a quota has been fixed even for Sarva Darshan Token system for every day in a week. On Saturday and Sunday we will issue 30thousand tokens, while on Tuesday, Wednesday, Thursday 17thousand tokens and on Monday and Friday it is fixed as 20 thousands, he added. These tokens will be issued on every day basis till the quota limit for the day expires. The fresh quota for next day opens at zero hours of evey day”, he reiterated.

However the JEO urged the pilgrims to bring Aadhaar card. “Aadhaar is must for Sarva Darshan Token system. And only if the pilgrim do not possess Aadhaar Voter Id card is accepted to get the tokens. We request the pilgrims to co-operate with TTD for hassle free darshan”, he informed.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 26 నుండి తిరుమల, తిరుపతిలో నిర్ణీత సంఖ్యలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ : తిరుమల జెఈవో

మే 24, తిరుమల 2018: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శకంగా సేవలందించే క్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లలో శుక్రవారం అర్ధరాత్రి అనగా మే 26వ తేదీ శనివారం తెల్లవారుఝామున 12.00 గంటల నుండి తిరుమల, తిరుపతిలలో నిర్ణీత సంఖ్యలో టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు మే 3వ తేదీ నుండి పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తునట్లు తెలిపారు. తిరుమలలో గత వారం రోజులుగా అధిక రద్దీ కారణంగా మంగళవారం నుండి తిరుమలలోని సర్వదర్శనం కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వివరించారు.

అధికారులతో సమీక్షించిన అనంతరం తెల్లవారుఝామున 12.00 గంటల నుండి ఏరోజుకు ఆరోజు భక్తులు ఎంచుకున్న టైంస్లాట్‌లో నిర్ణీత సంఖ్యలో తిరుమల, తిరుపతిలలోని అన్ని కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలియచేశారు. ఇందులో భాగంగా

– శని, ఆదివారాలలో 30 వేల టోకెన్లు

– సోమ, శుక్రవారాలలో 20 వేల టోకెన్లు

– మంగళ, బుధ, గురువారాలలో 17 వేల టోకెన్లు జారీ చేయనున్నాట్లు వివరించారు.

సర్వదర్శనం టోకెన్లు పొందని భక్తులు ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేసిన లేపాక్షి సర్కిల్‌ నుండి ప్రారంభమయ్యే క్యూలైన్‌లో ప్రవేశించి కంపార్టుమెంట్లలో వేచివుండి స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.

సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందే భక్తులు ఆధార్‌ కార్డు లేదా ఓటర్‌కార్డును తీసుకునిరావాలని జెఈవో కోరారు.

అంతకుముందు తిరుమల జెఈవో తిరుమలలోని గోకులంలోని కార్యాలయంలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లు, టోకెన్లు జారీ, తదితర అంశాలపై ఐటి, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.