SUBHAPRADHAM FROM MAY 25 ONWARDS-TIRUPATI JEO_విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ‘శుభప్రదం’ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 24 May 2018: The summer training camp for students of 7, 8 and 9 standards will commence from May 25, said Tirupati JEO Sri Pola Bhaskar.

A training meeting to 92 Telugu faculties hailing from two Telugu speaking states was held at SPRH in Tirupati on Thursday.

Speaking on this occasion the JEO said, the aim behind this programme is to make children the best citizens of tomorrow. He said, 4200 students from the states of AP and TS have registered for the same. “The training programme will take place at SPW Degree, SV Arts, SV Polytechnic, SGS Arts, SV Oriental, SP Jr, SV Jr colleges.

The inaugural program will be May 25 at Mahati Auditorium by 4.30pm and Sri Achalananda Swamy of Brahmamgari Mutt in Kadapa delivers his spiritual discourse.

HDPP Secretary Sri Ramana Prasad, Epic Exams co-ordinator Sri Damodar Naidu, principals of all colleges were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ‘శుభప్రదం’ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

మే 24, తిరుపతి, 2018: భారతీయ సనాతన ధర్మంపై విద్యార్థులకు అవగాహన కల్పించి ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో ప్రతి ఏడాది వేసవిలో శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. శుభప్రదం తరగతుల్లో బోధించే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 92 మంది ఉపన్యాసకులకు గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతిగృహంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ 2012వ సంవత్సరం నుంచి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాదీ మరింత మెరుగ్గా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠ్యాంశాలను మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. శుభప్రదం తరగతుల సమయంలో ప్రథమ చికిత్స, తాగునీరు, ఆహారం, భద్రత, వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఉపాధ్యాయులు సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఈసారి శుభ్రప్రదం శిక్షణ తరగతులకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి 7, 8, 9వ తరగతులకు చెందిన 4200 మంది విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాల, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు.

మే 25న మహతిలో ‘శుభప్రదం’ ప్రారంభ సమావేశం :

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మే 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుభప్రదం శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశం జరుగనుంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ అచలానంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీవిరజానందస్వామి విచ్చేసి విద్యార్థులకు మంగళాశాసనాలు అందిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, ఎపిక్‌ స్టడీస్‌ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదరనాయుడు, టిటిడి కళాశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.