OVER 5.36 LAKHS HAD DARSHAN IN SEVEN DAYS- DyEO Temple_ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట –

Tirumala,30 September 2017: In the last seven days over 5.36 lakh pilgrims had hassle free and comfortable darshan of Lord Venkateswara during annual brahmtosavams in spite of heavy influx, said Tirumala Temple Deputy EO Sri Kodanda Rama Rao.

The Temple DyEO Sri Kodandaram Rao told media persons at Media Centre on Saturday, that compared to last year figure where in 5.86 lakh pilgrim had darshan, he attributed the reduction in figures towards the issuance of limited number of Rs.300 tickets, and limiting Divya Darshan tokens on September 23 and 27, with an aim to give more preference to common pilgrims. He said to facilitate the common devotees TTD has maintained a buffer stock of 7.5 lakh laddus every day.

“Apart from this, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal in the direct supervision of Tirumala JEO Sri KS Sreenivasa Raju, we ensured hassle free darshan to pilgrims without push and pull in spite of heavy rush even during brahmotsavams”, he added.

He said about Rs.16.61crores was the revenue generated to TTD coffers through Srivari Hundi in the last one week. The DyEO Temple thanked all the pilgrims, TTD mandarins, temple staff, other department officials and media towards the smooth run of annual brahmotsavams.

Temple Peishkar Sri Ramesh, Potu Peishkar Ashok Kumar were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట –

దాదాపు 5.36 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం : ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండ రామారావు

తిరుమల, 30 సెప్టెంబరు 2017: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 5.36 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ కోదండ రామారావు తెలిపారు.

శనివారంనాడు రాంభగీచా 2లోని మీడియా సెంటర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 తగ్గించి సామాన్య

భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అధికంగా
పంపిణీ చేసినట్లు తెలియజేశారు.

శ్రీవారి హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 16.61 కోట్లు లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా 7 లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు వివరించారు. శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకు 22.80 లక్షల లడ్డూలు అందించినట్లు తెలియజేశారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేసినట్లు తెలియజేశారు. టిటిడి ఈవో

శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ సారధ్యంలో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు, పేష్కార్‌ శ్రీ పి.అశోక్‌ కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.