TWO MORE FOOD COUNTERS AT TIRUMALA_ తిరుమలలో మరో రెండు ఫుడ్ కౌంటర్లు ప్రారంభం

Tirumala, 27 May 2018: In view of the devotees rush to Tirumala during the summer vacations two more food counters have been set up at the ANC and HVC regions for the benefit of devotees.

The TTD Anna prasadam wing OSD Sri Venugopal told media on the ocassion that already TTD run food counters were operated at Rambagicha bus stand, CRO, PAC-1 providing snacks, anna prasadams and milk to devotees. The new food counters were opened on the advice of senior officials to cater to needs of devotees during summer and appealed to devotees to make use of them.

Among others TTD catering officer Sri GLN Shastri and others participated in the event.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో మరో రెండు ఫుడ్ కౌంటర్లు ప్రారంభం

మే 27, తిరుమల 2018: తిరుమలలోని ఏ.ఎన్.సి, హెచ్.వి.సి ఉప విచారణ కార్యాలయాల వద్ద ఆదివారం టిటిడి అన్నప్రసాద విభాగం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఫుడ్ కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాంభగీచా బస్టాండు, కేంద్రీయ విచారణ కార్యాలయం, పిఏసి-1 ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు తెలిపారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదనంగా ఏ.ఎన్.సి, హెచ్.వి.సి ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.