NADAPRIYA AND SRAVANA PRIYA VENKATESWARA_ నాదలోలుడు శ్రీనివాసుడు

Tirumala, 28 September 2017: The doyen of seven hills, Lord Venkateswara is not just Alankara Priya and Anna Priya but also Nada Priya.

Thousands of sankeertans written on his glory by Annamacharya and Alwars and other Dasas are examples of how he savored praises from devotees and granted them boons and bliss.

Legends show that Shravanam happens to be the birth star of Lord Venkateswara. ”In Sanskrit, “Shravanam” means “To Listen”. Lord wishes to listen to fine music and Sankeertans and hence is also known as “Nada Lola”, “Shravanam Priya.

Closely on the lines of saint-poet-singer Annamacharya and Dasas and Alwars of yesteryear many classical singers and exponents of the contemporary period have also extolled him and earned his grace. Stalwarts like MS Subbalaxmi, Dr Mangalam Balamuralikrishna etc have also sung sankeertans and set role models of devotion to him.

Top of it Puranas speak of Srivari fancy and adulation for voice of animals– Bulls (Vrishabha), Elephants and others that formed part of the Seshachala forest range and were his loyals in the mythological days .Even today instruments that blare out sounds of Bulls Gorgol) and Elephants (Trisul-nal) are a mandatory part of the Vadhya teams in the Srivari Temple.

In pursuance of Lords known desire for listening to fine music and fine keertans,the TTD has set up a SV recording project which digitised Annamcharya keertans and temple rituals etc for posterity in form of Audio and Video CDs.Today TTD has put up a huge platform Nada Niranjanam in the courtyard of Srivari Temple,Tirumala as a tribute Lords thirst for music. Particularly during Brahmotsavams well known artists perform at Nada Niranjanam.

As Nada priya Lord Venkateswara was also fond of Veda parayanams at his abode by archakas. Hence even today he wakes up and also sleeps to the rhythm of Veda parayanams. As per VaikhanasaAgamas (the procedures and punja systems established by Ramanujacharya) Veda parayanams and singing of Sankeertans are a must at his sanctum.

Mela Vadhyam of Srivari Temple

The dols and drums of yesteryears are still in service of Lord Venkateswara are very much his favorites even today. Four times a day the 19 instruments are played in all major happenings in the temple. The Dols, Mukku Veena,Tirichinallu, Gauru Gollu, Sanna dolu and Shruti are among the 19 instruments that are still used day in and out to wake up Lord Venkateswara from his brief night sleep and also perhaps his only entertainment of sorts.

Just as the Agama stotras and Annamayya Keertans, the sound of Mela Vadyam is also an integral part of the rituals, tradition and practices.The TTD rejuvenated and repair all these instruments during the Brahmotsavam -2011 with gusto. Nadaswaram service was provided to Archakas twice a day along with bell and the sound of (Gauru-Gollu and Sanna dolu) cautioning people on the street of their arrival. The Nadaswaram players have a dress code of white lungi, shirt and a upper cloth
Mela vadyam is presented 14-15 times on a day and some times more during festivals and special occasions.Lord wakes up and sleeps to sound of our Nada swaram’ Arunachalam a prominent Mela Vadyam proudly says. Most prominent among the Nadaswaram is the “Naava-bath kana” band of music instruments(19)instituted by the Srikrishnadevaraya in the 15th century. The TTD also plans to popularize nearly 100 nadaswaram instruments, some of which are also in engangered list. The SV museum,Tirumala has on display 400 years old instruments– Brahma Nagara 12×6 feet and a Banke (antique bugle) 12 feet tall.

For ekanta seva only five instruments Mukku Veena, Tirichinallu, Gauru Gollu, Sanna dolu and Shruti are played to soothe the deity to sleep after a hard days labor.TTD also hired 32 teams from Srirangam, V.Kota and Mambalam on contract basis. TTD has provided quarters, pensions,medical benefits for Mela artists.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నాదలోలుడు శ్రీనివాసుడు

సెప్టెంబర్‌ 28, తిరుమల 2017: శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి వేదం, నాదం, వాద్య నివేదనలు. వీటిలో నాదం అతి ముఖ్యమైనది. శ్రీ తాళ్లపాక అన్నమయ్య, శ్రీ పురందరదాస, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ లాంటి వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో, ఆళ్వారులు తమ పాశురాలతో శ్రీవారిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు శ్రీమతి ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి, శ్రీమంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి కళాకారులు స్వామివారికి నాదనీరాజనం సమర్పించారు. శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణం. శ్రవణం అనే వినడమని అర్థం. భక్తులు భక్తితో సమర్పించే సంగీతాన్ని, కీర్తనలను స్వామివారు ఆలకిస్తారన్నది పండితుల మాట.

పురాణాల ప్రకారం పూర్వకాలంలో శేషాచలం అడవుల్లోని వృషభం, ఏనుగు లాంటి జంతువులు అరుపులతో స్వామివారిని కొలిచేవట. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆ తరువాత కాలంలో అలాంటి శబ్దాలను ఉత్పత్తి చేసే వాయిద్య పరికరాలను శ్రీవారి ఆలయంలో ఉపయోగిస్తున్నారు. వీటిలో వృషభానికి సంబంధించి గౌర్‌గోల్‌, ఏనుగుకు సంబంధించి త్రిశూల్‌నాల్‌ వాద్యపరికరాలున్నాయి. స్వామివారికి ఇష్టమైన సంకీర్తనలను, సంగీతాన్ని రికార్డు చేసేందుకు టిటిడి శ్రీవేంకటేశ్వర రికార్డింగ్‌ ప్రాజెక్టును నెలకొల్పింది. ఇందులో అన్నమాచార్య సంకీర్తనలను రికార్డు చేసి భక్తలోకానికి అందిస్తున్నారు. దీంతోపాటు శ్రీవారి ఆలయం ఎదుట నాదనీరాజనం వేదికను ఏర్పాటుచేసి ప్రతిరోజూ ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో నాదనీరాజనం కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

శ్రీవారి రోజువారీ పూజా కైంకర్యాల్లోనూ నాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆలయంలో సుప్రభాతం ద్వారా స్వామివారిని మేల్కొలుపుతారు. వైఖానస ఆగమం ప్రకారం ఆలయంలో నిర్వహించే పలు కైంకర్యాల్లోనూ వేద పండితులు వేదపారాయణం చేసే సంప్రదాయముంది.

శ్రీవారి ఆలయంలో మేళ వాయిద్యం :

శ్రీవారి ఆలయంలో ప్రాచీన సంప్రదాయ వాద్యపరికరాలను ఇప్పటికీ వినియోగిస్తుండడం విశేషం. తెల్లవారుజామున సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు 19 రకాల వాద్యపరికరాలను వినియోగిస్తారు. వీటిలో డోలు, ముక్కువీణ, తిరిచినాళ్లు, గౌరుగోలు, సన్నడోలు, శృతి తదితర పరికరాలున్నాయి. ఆగమాల ప్రకారం ఆలయంలో కైంకర్యాల నిర్వహణకు మేళ వాయిద్యం తప్పనిసరి. అవసరమైనపుడు కొత్త మేళ వాయిద్యాలతో పాటు కావాల్సిన మరమ్మతులు చేపడతారు. రోజుకు రెండు సార్లు నైవేద్యం గంట సమయంలో నాదస్వరం వాయిస్తారు. అర్చకులు, జీయంగార్లు విచ్చేసే సమయంలో భక్తులను అప్రమత్తం చేసేందుకు గౌరు గోలు, సన్నడోలు వాయిస్తారు. నాదస్వరం కళాకారులు తెల్లచొక్కా, పంచె, ఉత్తరీయం ధరించి డ్రెస్‌కోడ్‌ పాటిస్తారు.

సాధారణ రోజుల్లో 14 సార్లు, ఉత్సవాల రోజుల్లో ఇంకా ఎక్కువసార్లు మేళ వాయిద్యం ఉంటుంది. ప్రముఖ నాదస్వర కళాకారుడు శ్రీ అరుణాచలం మాట్లాడుతూ స్వామివారు మేల్కొనాలన్నా, హాయిగా నిద్రకు ఉపక్రమించాలన్నా నాదస్వర వాద్యం ఉండాల్సిందేనని చెప్పారు. ఇంతటి విశిష్టమైన నాదస్వరం, డోలు లాంటి మేళవాయిద్యాలకు ప్రాచుర్యం కల్పించేందుకు టిటిడి ఎస్వీ నాదస్వర పాఠశాలను నిర్వహిస్తోంది. అంతేగాక, తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో 400 ఏళ్ల కాలం నాటి బ్రహ్మ నగారా, బ్యాంకె లాంటి పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. ఏకాంత సేవలో శ్రీవారి సేద తీర్చేందుకు ముక్కువీణ, తిరిచినాళ్లు, గౌరుగోలు, సన్నడోలు, శృతి వాద్యాలను వినసొంపుగా వాయిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.