LORD SRI KODANDA RAMA RIDES ON RATHAM_ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

Vontimitta, 31 March 2018: As a part of the ongoing brahmotsavams at Vontimitta in YSR Kadapa district, on Saturday, Lord Sri Kodanda Rama took celestial ride on the massive wooden chariot along with Sita Devi and Lakshmana Swamy.

The idols of the presiding deities were placed on the divine chariot and was taken around the temple with pomp and fervour.

Devotees participated with enthusiasm and gaiety and pulled the large chariot on the seventh day.

The Vahana Sevas and Alankarams of Lord concludes on Sundaywith Kaliyamardana Alankaram and Aswa Vahanam. The Brahmotsavams concludes on Monday with Chakrasnanam and Dhwajarohanam on April 2. While on April 3 Pushpayagam will be performed between 5:30pm to 9pm on Tuesday.

Temple AEO Sri Ramaraju and other staff members also took part in this celestial fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట, 2018 మార్చి 31: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9.06 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

సాంస్కృతిక కార్యక్రమాలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మాడా వేంకటరమణ ”రాముడు ధర్మస్వరూపుడు” అనే అంశంపై ధార్మికోపన్యాసం ఇచ్చారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీ జి.మధుసూదన్‌ బృందంచే భక్తి సంగీతం, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ టి.వేంకటరమణ భాగవతార్‌ హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రామరాజు, సూపరింటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.