THOUSANDS TAKE PART IN TUMBURU TEERTHA MUKKOTI_ తుంబురు తీర్థ ముక్కోటిలో వేలాదిగా పాల్గొన్న భక్తులు

Tirumala, 31 March 2018: Thousands of devotees trekked the hilly rock to reach Tumburu Teertham located in the lush green forests of Seshachalam on Saturday.

Though the Teertha Mukkoti is on Saturday, thousands of pilgrims reached it on March 30 itself. TTD has made elaborate anna prasadam and drinking water arrangements with proper security vigil by TTD security as well police for the safety of devotees on March 30 and 31.

About 4000 pongal, upma, packets each, 3000 each sambar rice and curd rice packets and 2000 each coffee and milk were distributed from 6am to 10pm on March 30. On Saturday March 31 from 6am onwards pongal, upma, pulihora, bisibelabath, tomato rice and curd rice were distributed. Apart from this one lakh water and 50000 buttermilk packets and 20000 water bottles have also been distributed to devotees who trekked Tumburu Teertham.

Each devotee was provided with 2 pulihora, one curd rice, two butter milk and 4 water dat cheta as a pack bag. srivari sevakulu distributed these bags to devotees at Papavinasanam dam.

The engineering officials have also made necessary facilities en route theeram keeping in view the safety and convenience of devotees.

TTD officials supervised the arrangements. The devotees expressed their immense satisfaction over the arrangements made by TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తుంబురు తీర్థ ముక్కోటిలో వేలాదిగా పాల్గొన్న భక్తులు

మార్చి 31, తిరుమల 2018: తిరుమలలోని శేషాచల అడవుల్లో ఒకానోక ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఫాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన

పౌర్ణమినాడు అనగా మార్చి 31వ తేది శనివారం తుంబురు తీర్థ ముక్కోటి వున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6.00 గంటల నుండి భక్తులు కాలినడకన ఈ తీర్థానికి విచ్చేశారు. శనివారం మధ్యాహ్నం 1.00 గంట వరకు దాదాపు 27 వేల మంది భక్తులు తుంబురు తీర్థానికి చేరుకున్నారు.

టిటిడి విస్తృత ఏర్పాట్లు

తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మార్చి 30వ తేదీ ఉదయం 6.00 నుండి రాత్రి 10.00 గంటల వరకు 4 వేలు పొంగలి, 4 వేలు ఉప్మా ప్యాకెట్లు, 2 వేలు కాఫీ, 2 వేలు పాలు, 3 వేలు సాంబరు అన్నం, 3 వేలు పెరుగన్నం భక్తులకు అందించారు. అదేవిధంగా మార్చి 31వ తేది శనివారం ఉదయం 6.00 గంటల నుండి పొంగలి, ఉప్మా, కాఫీ, పాలు, మధ్యాహ్నం టమోటఅన్నం, బిస్‌బిలాబాత్‌, పెరుగన్నం, పులిహోరాను భక్తులకు అందిస్తున్నారు. భక్తుల కొరకు రెండు లక్షల తాగునీరు ప్యాకెట్లు, 50 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ పంపిణీ చేశారు. మహిళలకు ప్రత్యేకంగా 20 వేల తాగునీటి వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు.

ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. పాపవినాశనం డ్యాం వద్ద తుంబురు తీర్థానికి వెళ్ళే మార్గంలో రెండు పులిహోర, ఒక పెరుగన్నం, రెండు మజ్జిగ ప్యాకెట్లు, 4 త్రాగునీటి ప్యాకెట్ల్‌తో కూడిన ఒక సంచిన టిటిడి భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా పంపిణి చేసింది. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు.

ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు రెండు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

అన్నప్రసాద వితరణ ఏర్పాట్లను టిటిడి క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రీ పర్యవేక్షిస్తున్నారు. టిటిడి కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.