TTD TEMPLES TO SHUT ON JULY 27 FOLLOWING LUNAR ECLIPSE_ జూలై 27న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత
Tirupati, 25 July 2018: The sub-temples of TTD will remain closed for almost 12 hours from 5pm of July 27 till 5am on July 28 following Lunar eclipse on Friday.
The Lunar eclipse will occur.between 11.54pm of July 27 till 3.49am of July 28.
All the local temples including Tiruchanoor, Srinivasa Mangapuram, Appalayagunta, Kapilateertham, Sri Govinda Raja Swamy, Sri Kodanda Rama Swamy temple both at Tirupati and Chandragiri etc. almost follow the same time for closing and opening of main temple doors on July 27 and 28 respectively.
The darshan to pilgrim devotees will resume after performing Suddhi, Punyahavachanam etc. from 6.30am on wards.
In view of eclipse all the Annaprasadam distribution centres including PAT Annaprasadam Complex, Srinivasam, Vishnunivasam, II Chowltry, hospitals, SPRH canteen, employees canteen etc. will be closed by 3pm on July 27.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 27న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత
తిరుపతి, 2018 జూలై 25: చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేయనున్నారు. తిరిగి జూలై 28వ తేదీ శనివారం ఉదయాత్పూర్వం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జూలై 27న రాత్రి 11.54 గంటల నుండి జూలై 28న ఉదయం 3 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాలను మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయాల తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేస్తారు. మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలో అన్నప్రసాద వితరణ కేంద్రాల మూత…
చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు తిరుపతిలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, 2వ సత్రాలు, ఆసుపత్రులు, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్, టిటిడి పరిపాలనా భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌లో అన్నప్రసాద వితరణ ఉండదు. జూలై 28వ తేదీ ఉదయం నుండి యథావిధిగా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.