LUNAR ECLIPSE ON JULY 27-TEMPLE DOORS TO BE CLOSED BY 5PM_ చంద్ర గ్రహణం కారణంగా జూలై 27న సా|| 5.00 నుండి మరునాడు ఉ|| 4.15 గం||ల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూత

Tirumala, 3 July 2018: In view of total Lunar Eclipse on July 27, the temple doors of Sri Tirumala Temple will be closed in the evening.

Meanwhile the Lunar Eclipse occurs at 11:54 PM of July 27 on Friday and lasts till 3:49 AM on July 28 on Saturday. Usually the temple doors will be closed six hours prior to the Grahanam muhurtam.

The Temple doors of Sri Tirumala Temple will be closed by 05:00 PM on July 27 after performing night kainkaryams and naivedyams. After conclusion of Lunar Eclipse the Temple Doors will be reopened by 4:15 AM on Saturday with Suprabatham followed by conduct of Punyahavachanam and other daily rituals.

TTD has cancelled Arjitha sevas such as Kalyanotsavam, Unjal Seva, Brahmotsavam, Vasantotsavam and Sahasra Deepalankara Sevas on July 27 in view of Grahanam while Suprabatham, Thomala and Archana Sevas will be performed as Ekantham on July 28.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చంద్ర గ్రహణం కారణంగా జూలై 27న సా|| 5.00 నుండి మరునాడు ఉ|| 4.15 గం||ల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూత

జూలై 03, తిరుమల 2018: చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు.

జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. జూలై 28న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.

జూలై 27న ఆర్జితసేవలు రద్దు –

చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెతవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు

ఈ నెల 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.