MAGNIFICENT SNAPANA TIRUMANJANAM AT SRI PVT_ వైభవంగా శ్రీ భూ సమేత ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వర‌స్వామివారి స్నపన తిరుమంజనం శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

Appalayagunta, 15 Jun. 19: TTD rolled out spectacular snapana thirumanjanam ritual for utsava idols at Sri Prasanna Venkateswara temple, Appalayagunta on the third day, Saturday morning of on-going annual Brahmotsavams.

The event conducted under the supervision of chief priest and kankana bhattar Sri Surya Kumar Acharyulu was hailed as the pinnacle of Agama traditions. The ritwiks adorned the idols seven garlands made of five traditional flowers and aromatic leaves as they chanted Vedic hymns.

TTD DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Sri Gopalakrishna, temple inspector Sri Srinivasulu and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ భూ సమేత ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వర‌స్వామివారి స్నపన తిరుమంజనం శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

తిరుపతి, 2019 జూన్ 15: శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) మూడో రోజైన శ‌నివారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా శ‌నివారం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు ఆలయంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో ఐదు రకాల సాంప్ర‌దాయ‌ పూలు రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.