MAHA SHANTI YAGAM COMMENCES _ శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శాస్త్రోక్తంగా ప్రారంభమైన మహాశాంతి యాగం
Tirupati, 12 February 2022: Seeking the divine intervention from the Corona pandemic, TTD for the first time organised Maha Shanti Yagam in Sri Ramachandra Pushkarini in Tirupati on Saturday.
This fete will conclude on Monday. The Yagam was performed by 50 Ritwiks from morning to night in two sessions.
Special Gr DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Agama Advisor Sri Vedantam Vishnu Bhattacharyulu were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద శాస్త్రోక్తంగా ప్రారంభమైన మహాశాంతి యాగం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 12: లోక సంక్షేమం కోసం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితులను అధిగమించడానికి శనివారం ఉదయం తిరుపతి శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద మహాశాంతి యాగం శాస్త్రోక్తంగా టిటిడి ప్రారంభించింది. ఈ యాగం ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. ఇందులోభాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. తరువాత పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, కంకణ ధారణ, 34 హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ట జరిగింది. అనంతరం 50 మంది ఋత్వికులు పంచ శూక్త హోమం, పాలమాస్థిత ఉపనిషత్ హోమం, సర్వశాంతి హోమం, లఘుపూర్ణాహుతి జరిగాయి. ఈ యాగానికి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వైఖానసాగమ పండితులు శ్రీ శ్రీనివాస దీక్షితులు కంకణభట్టార్‌గా వ్యవహరిస్తున్నారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు , సర్వశాంతి హోమకార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.