MAHAPURNAHUTI AND KUMBHABHISHEKAM PERFORMED IN SRI SRINIVASA TEMPLE_ తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో వైభవంగా మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం

Tiruchanoor, 27 April 2018: Mahapurnahuti and Maha Kumbhabhishekam were performed in Sri Srinivasa Temple in Tiruchanoor on Friday.

As a part of this religious event, special Rituals including Chatustarchana, Sikhara Pratista, Garudalwar Pratista, Maha Nivedana, Mangalaharati, Mantrapushpam, Sattumora were performed.

Meanwhile, according to legend, this 300 year old temple was developed by Sri Madabhusi Ananta Sayanam Ayyangar who discharged plum posts as Governor of Bihar and Speaker of Lok Sabha.

Vaikuntha Dwara Darshan on the auspicious Vaikuntha Ekadasi day is most important event in this temple. Those who could not make it out to Tirumala temple will satisfy with the darshan of Sri Srinivasa at Tiruchanoor.

Spl Gr DyEO Sri Munirathnam Reddy, Kankana Bhattar Sri Rajesh, Sri Venugopala Charyulu, AEO Sri Subramanyam, DyEE Sri Umashankar, AVSO Sri Parthasarathy Reddy and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో వైభవంగా మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం

ఏప్రిల్‌ 27, తిరుపతి, 2018: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయంలో శుక్రవారం ఉదయం మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ శ్రీనివాస ఆలయంలో చతుస్థానార్చన, పెరుమాళ్లకు నివేదన, బలిహరణ, మంగళహారతి, మహారాజగోపుర ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, గరుడాళ్వార్ల ప్రతిష్ట, మహానివేదన, మహామంగళహారతి, మంత్రపుష్పం, శాత్తుమొర, తీర్థప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలను టిటిడి ఆగమసలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.

ఆలయ విశిష్టత

తిరుచానూరులోని శ్రీనివాసుడి ఆలయాన్ని శ్రీనివాస పెరుమాళ్‌ ఆలయంగా గతంలో వ్యవహరింపబడినట్లు పురాణాలు చెబుతున్నాయి. సువర్ణముఖి నదీతీరంలో ఆలయం వెలసి ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఈ ఆలయం ప్రత్యేకత. ఒకే పుణ్యక్షేత్రంలో అమ్మవారికి, స్వామివారికి వేరువేరుగా ఆలయాలు వెలసి ఉండటం అరుదైన విషయంగా భావిస్తారు. ఈ ఆలయానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌ గవర్నర్‌, లోకసభ స్పీకర్‌గా పనిచేసిన శ్రీమాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. 2008 సంవత్సరంలో అయ్యంగార్‌ ఈ ఆలయాన్ని టిటిడిలో విలీనం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు తిరుచానూరు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పండితులు చెబుతున్నారు.

ఆలయంలో ప్రాచీన విగ్రహాలు

ఆలయంలో మూలమూర్తి శ్రీనివాస పెరుమాళ్‌, ఉత్సవర్లు, శ్రీ లక్ష్మీఅమ్మవారు, అనంత, గరుడ, విష్వక్సేనులు, శ్రీ భాష్యకారులు తదితర విగ్రహాలు వెలసి ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీ మునిరత్నం రెడ్డి, కంకణభట్టార్‌ శ్రీ ఆర్‌. రాజేష్‌, శ్రీ వేణుగోపాలచార్యులు, డిప్యూటీ ఈఈ శ్రీ ఉమాశంకర్‌, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏవీఎస్‌వో శ్రీ పార్థసారథి రెడ్డి, శ్రీ కులశేఖర్‌, రుత్వికులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.